https://oktelugu.com/

Pattabhi : ఎంత పని అయిపాయే… ‘పట్టాభి’ విషయంలో పచ్చ మీడియా తలదించుకుంది

జర్నలిజం అనేది సొంత డబ్బా అయిపోయింది కాబట్టి… దానిని ఇప్పుడు ఎవరూ మార్చలేరు. బూదరాజు రాధాకృష్ణ, నార్ల వెంకటేశ్వరరావు, పతంజలి వంటి వారు పంచలు కట్టుకొని, చేతిలో బెత్తాలు పట్టుకొని, వీపుల మీద వాతలు వచ్చేలా కొట్టినా మారే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఎవరూ మార్చలేని స్థితికి మీడియా పడిపోయింది కాబట్టి.. కాదు కాదు మీడియాను నడిపే వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి.. పెట్టుబడిదారుల విష పుత్రికలుగా మారిన తర్వాత పత్రికల్లో విలువలు ఏముంటాయి? విజ్ఞతలు ఏముంటాయి? అంతా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 22, 2023 / 10:01 PM IST
    Follow us on

    జర్నలిజం అనేది సొంత డబ్బా అయిపోయింది కాబట్టి… దానిని ఇప్పుడు ఎవరూ మార్చలేరు. బూదరాజు రాధాకృష్ణ, నార్ల వెంకటేశ్వరరావు, పతంజలి వంటి వారు పంచలు కట్టుకొని, చేతిలో బెత్తాలు పట్టుకొని, వీపుల మీద వాతలు వచ్చేలా కొట్టినా మారే పరిస్థితులు లేవు. ఎందుకంటే ఎవరూ మార్చలేని స్థితికి మీడియా పడిపోయింది కాబట్టి.. కాదు కాదు మీడియాను నడిపే వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి.. పెట్టుబడిదారుల విష పుత్రికలుగా మారిన తర్వాత పత్రికల్లో విలువలు ఏముంటాయి? విజ్ఞతలు ఏముంటాయి? అంతా బభ్రజమానం.. భజగోవిందం..

    అబద్ధాలు రాయకపోతే అది పాత్రికేయం ఎలా అవుతుంది?

    వెనుకటికి ఈనాడు జర్నలిజం స్కూల్లో పాఠాలు చెబుతున్నప్పుడు బూదరాజు రాధాకృష్ణ కేవలం నిజాలు మాత్రమే రాయాలని పాత్రికేయ విద్యార్థులకు సూచించేవారు. వాస్తవ దూరంగా ఉన్న వార్త ఎప్పటికీ మనలేదని ఆయన సూటిగా చెప్పేవారు. కానీ ఇప్పుడు దాన్ని ఎవరు పట్టించుకుంటున్నారు? అప్పట్లో వైయస్ మీద ఎన్ని రాసినా.. ఇప్పుడు జగన్ మీద రాస్తున్నా… ఈనాడు, జ్యోతి, టీవీ 5, ఏబీఎన్, మహా టీవీ… ఎప్పుడైనా పొరపాటో, తప్పో దొర్లితే వివరణ, ఖండన, క్షమాపణ, సంతాపం, పశ్చాత్తాపం లాంటివి ఉండేవి కావు. అసలు అబద్ధం రాయకపోతే ఇప్పుడు పాత్రికేయం ఎలా అవుతుంది? అసలు జగన్ మీద రాకపోతే అది ఎల్లో జర్నలిజం ఎలా అవుతుంది? ఇలాంటి టెంపర్ తనం కనిపించేది.. అంతేకాదు మా పొలిటికల్ లైన్ ఇదే, ఏం చేసుకుంటావో చేసుకోపో అనే వైఖరి కనిపించేది. క్రమేపీ పాఠకులు కూడా ఈ ధోరణికి అలవాటు పడిపోయారు. ఏదైనా ముఖ్యమైన వార్త వస్తే సోషల్ మీడియా పోస్టులతో నిజం ఏమిటో చెక్ చేసుకుంటున్నారు.. (వాస్తవానికి ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను సాక్షితో కంపేర్ చేసుకోవాలి. అదేం దురదృష్టమో గాని ఆ సాక్షి జగన్ కు ఎప్పుడూ ఉపయోగపడదు. జగన్ కూడా దానిని పెద్దగా పట్టించుకోడు. ఉన్నది అంటే ఉన్నది అంతే.) అత్యంత అరుదుగా వివరణ, సంతాపం, ఖండన వంటివి కనిపిస్తాయి. బుధవారం జరిగింది కూడా ఇదే. మంగళవారం తెలుగుదేశం నాయకుడు పట్టాభిని పోలీసు కష్టడీలో ఉండగానే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కొట్టారు అనేది వార్త.. గతంలో రఘురామ కృష్ణంరాజు ఆరోపణ కూడా ఇదే.

    పాత్రికేయరాహిత్యం

    ఇదే విషయం మీద ఆంధ్రజ్యోతి ఫస్ట్ లీడ్ వార్తలో పాత్రికేయరాహిత్యాన్ని నిర్లజ్జగా ప్రదర్శించింది. ఈరోజు ఈనాడు బ్యానర్ స్టోరీ కూడా అదే. వాళ్ల పొలిటికల్ లైన్ ఆధారంగా పట్టాభి అండ్ కో చెప్పారని అడ్డగోలుగా కుమ్మేశారు. ఆ రెండు పత్రికలకు బురద చల్లడం కామనే కదా… పట్టాభి చేతులకు, కాళ్లకు గాయాలు అయినట్టు ఫోటోలు కూడా పెట్టారు.. కానీ అందులో చేతుల ఫోటోలు మాత్రమే నిన్నటివి. కాళ్లపై గాయాలు 2021 నాటివి. అంటే స్టోరీలో సీరియస్ నెస్ కోసం పాత ఫోటోలు కూడా జత చేసి దంచి కొట్టి స్టోరీని వాడారు. అంటే ఇక్కడ రఘురామకృష్ణంరాజును కొట్టిన సంగతిని గుర్తు చేస్తున్నారా అన్యాపదేశంగా? వోకే, అదీ గుర్తు చేస్తే తప్పులేదు, కానీ కంటెంట్ లో ఉండాలి కదా ఆ రుజువులు అవీ లేవు.

    బ్లండర్ దొరికింది

    ఇక ఈనాడు బ్లండర్ ఎక్కడ పక్కా ఆధారంతో దొరుకుతుందా అని ఏపీ పోలీసులు, ప్రభుత్వం ఎదురుచూస్తోంది. పైగా ఇది కోర్టు పిటిషన్ తో ముడిపడి ఉన్న వ్యవహారం. మరోవైపు పాత ఫోటోలతో పక్కగా దొరికిపోయేట్టుగా ఉంది. పైగా లక్షల కాపీలు ఈ తప్పుడు ఫోటోలతో మార్కెట్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు తాపీగా “అరెరే చేతులపై కొట్టిన ఫోటోలు మంగళవారం నాటివే, కాళ్లపై కొట్టినట్టు ఉన్న ఫోటోలు మాత్రం పాతవి, ఈ మేరకు ఈ పేపర్లో సవరణ చేసాం, సాంకేతిక కారణాలతో ఈ తప్పు దొర్లింది చింతిస్తున్నాం అని ఈటీవీలో, ఈ -పేపర్ లో రాసుకున్నారు. మరి లక్షల ప్రింట్ కాపీల్లో జనంలోకి వెళ్లిపోయిన తప్పు మాట ఏమిటి? ఇప్పటికంచికలో ఈనాడులో కూడా సవరణ లేదా వివరణ ఇస్తారా? అయినా జగన్ పై బురద చల్లడం అలవాటైపోయినప్పుడు, అదీ తామ బురదలో ఉండి ఈ చల్లె ప్రక్రియ జోరుగా చేస్తున్నప్పుడు మన బట్టల మీద బురద పడకుండా చూసుకోవాలి. లేకపోతే ఇలాగే కడుక్కోవాల్సి వస్తుంది. లేకపోతే పోలీసుల థర్డ్ డిగ్రీ మా మీద ప్రయోగించారు అని తెల్లారి రాసుకోవాల్సి ఉంటుంది..పాపం రామోజీ రావు…జగన్ చేతిలో ఎంత ఇబ్బంది పడుతున్నాడో?

    -ఈనాడు వివరణ