Ram Charan’s success : మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ చాలా తక్కువ సమయంలోనే భారీ సక్సెస్ లు అందుకున్నాడు. అయితే మధ్యలో కొద్ది రోజులు పాటు ఆయన హిట్ లేకుండా గడపాల్సి వచ్చింది.ఇక అదే సమయం లో ఆయన యాక్టింగ్ మీద చాలా మంది చాలా విమర్శలు చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసిన కూడా ప్రతి ఒక్కరికి తన యాక్టింగ్ తోనే సమాధానం చెబుతూ వచ్చాడు. రంగస్థలం ముందు వరకు ఆయనకి యాక్టింగ్ రాదు అంటూ కొంతమంది రైటర్లు ఓపెన్ గా ఆయన మీద కామెంట్లు చేశారు. అలాగే అతన్ని దూషిస్తూ కూడా మాట్లాడడం మనం చూశాం…
టాలీవుడ్ లో ప్రముఖ రైటర్ రాంచరణ్ కు అస్సలు నటన రాదని.. ఆయన తండ్రి చిరంజీవి పేరు చెప్పుకొని సినిమాలు చేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేయడం.. దానికి నాగబాబు లాంటి వారు కౌంటర్ ఇవ్వడం చూశాం… ఈ రైటర్ కొన్ని మనో విజ్ఞాన, హర్రర్ పుస్తకాలు కూడా రాశాడు.. అవి పాపులర్ అయ్యాయి. ఆ సీనియర్ రైటర్ విమర్శలే రాంచరణ్ ను రాటు దేల్చాయి. నటనలో మెలకువలు నేర్చుకునేలా చేశాయి
ఇక రామ్ చరణ్ ఎలాగైనా తన సత్తా చూపించుకోవాలనే ఉద్దేశ్యం తోనే చాలా కష్టపడి యాక్టింగ్ మెలకువలు నేర్చుకొని రంగస్థలం సినిమాతో తన యాక్టింగ్ ఏ లెవెల్ లో ఉంటుందో ప్రతి ఒక్క అభిమానికి తెలియజేశాడు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమా తో మరో మెట్టు పైకి ఎక్కడనే చెప్పాలి. ఇలా తనకొచ్చిన విమర్శలని తొక్కుకుంటూ ఎదురుదాడి చేసి నటుడు గా తనని తను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా రామ్ చరణ్ ని చూసి చాలా నేర్చుకోవచ్చు అని అనుకునేలా తనని తాను మౌల్డ్ చేసుకున్నాడు. అందుకే ఎవరైనా విమర్శిస్తే స్వీకరించి దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి కానీ విమర్శిస్తున్నందుకు బాధపడకూడదు అనేది ఆయన లైఫ్ స్టైల్ ని చూస్తే మనకు అర్థమవుతుంది…
ఇక ఇదే విధంగా రామ్ చరణ్ తనను ఎవరైతే విమర్శించారో వాళ్ళందరికీ ఒక చెంప దెబ్బ కొట్టినంత పని చేశాడు తన నటనతోనే ఒక్కొక్కరికి సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించాడు.అందుకే ఏ ఒక్క వ్యక్తిని కూడా మనం తక్కువ అంచన వేయకూడదు ఎవరిలో ఎంత టాలెంట్ ఉందనేది వాళ్లకు మాత్రమే తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ముందుకెళ్లాలి.
ఇక రామ్ చరణ్ కూడా చాలాసార్లు ఇదే చెప్పాడు ఈ విషయాన్ని వాళ్ళ నాన్న అయిన చిరంజీవి రాంచరణ్ తో చాలాసార్లు చెప్పినట్టుగా తెలియజేశాడు… కెరియర్ మొదట్లో ఎవరైనా రాంచరణ్ ని విమర్శిస్తే రాంచరణ్ కూడా చాలా ఫైర్ గా ప్రతి విమర్శ చేసేవాడు కానీ చిరంజీవి చెప్పిన మాటల వల్ల తను చాలా కూల్ గా మారిపోయి విమర్శని స్వీకరిస్తూ దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు…