Mahesh Babu Favorite Food: అమ్మాయిల రాకూమారుడిలా.. హాలీవుడ్ హీరోల ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ఆ ఫిజిక్ ను అంత చక్కగా ఎలా మెయింటేన్ చేస్తాడన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. అసలు మహేష్ బాబు ఏం తింటాడు? ఆయన డైట్ ఏంటన్నది ఇప్పటివరకూ పెద్దగా బయటకు రాలేదు. ఆయనా చెప్పుకోలేదు.
ఈ మధ్య ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్ లో యాంకర్ బిత్తిరి సత్తి ఇదే విషయాన్ని ఆపుకోలేక అడిగేశారు. మీరింత అందంగా ఉంటారు కదా? ఏం తింటారని.. దానికి కూడా మహేష్ బాబు సరైన సమాధానం ఇవ్వలేదు. ఏదైనా మితంగా తినాలని.. 10 లేదా 12 పూరీలు కాకుండా ఓ రెండూ పూరీలు లేదా 2 చపాతీలు.. ఇలా లిమిటెడ్ గా తినాలని సూచించాడు. అంతే తప్ప తను ఏం తింటాడన్నది బయటపెట్టలేదు.
అయితే తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మహేష్ బాబు తన డైట్ ను బయటపెట్టాడు. తనకు ఏమి ఇష్టం.? ఏం తింటాడన్నది వివరించాడు. అదిప్పుడు వైరల్ గా మారింది. మహేష్ బాబు డైట్ ను తూ.చా. తప్పకుండా పాటిస్తాడట.. స్టిక్ట్ గా రూల్స్ పాటిస్తాడట.. ఆహారం విషయంలో ఆయనకు సపరేట్ మెనూ ఉంటుందని వివరించాడు.
మహేష్ బాబు చాలా బ్యాలెన్స్ డ్ డైట్ పాటిస్తాడు. మధ్యాహ్నం పూట కాజూ, బాదం, పచ్చి కూరగాయలు తింటాడట.. ఇక మహేష్ కు సంప్రదాయ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమట.. నెలలో ఖచ్చితంగా రెండు మూడు సార్లు బిర్యానీ తినకుండా ఉండలేడట.
మహేష్ బాబు దూరంగా పెట్టేవి ఏవంటే స్వీట్స్.. వాటి జోలికి అస్సలు పోడని తెలిపారు. ఇక పెరుగు కూడా మహేష్ బాబు తినడట.. నూడుల్స్ సహా బేకరీల్లో దొరికే జంక్ ఫుడ్ ను అస్సలు ముట్టుకోనని తెలిపాడు.
మహేష్ బాబు అంత్యంత ఇష్టమైన స్నాక్ ఏంటంటే.. అది ‘మిర్చీ బజ్జీ’ మిర్చీ బజ్జీ తిన్నాక మసాల అల్లం టీ తాగడం మహేష్ కు బాగా ఇష్టమట.. ఎక్కడున్నా కానీ సాయంత్రం మిర్జీ బజ్జీ అల్లం టీని ప్రత్యేకంగా తయారు చేసుకొని మరీ తినడం మహేష్ కు అలవాటు. మిర్చి బజ్జీ ఎన్నైనా మహేష్ లాగించేస్తాడట..
ఇక చాపల పులుసు అంటే మహేష్ బాబుకు చాలా ఇష్టం. తన అమ్మమ్మ ఆ కూర చేస్తే చిన్నప్పుడు లాగించేవాడట.. ఇప్పటికీ దాన్ని ఇష్టంగా తింటాడు. ఇక మహేష్ బాబు కాఫీ లవర్. రోజుకు కనీసం రెండు మూడు కప్పుల కాఫీలు తాగుతుంటాడు.