https://oktelugu.com/

Pawan Kalyan’s ‘Bro’ : పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్రం లో ఐటెం సాంగ్ కోసం ఊర్వశి రౌతేలా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

Pawan Kalyan’s ‘Bro’ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న సినిమాలలో కేవలం రెండు మూడు సన్నివేశాలు మరియు ఒక పాట మినహా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న చిత్రం ‘బ్రో ది అవతార్’. సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కి […]

Written By:
  • NARESH
  • , Updated On : June 5, 2023 / 08:11 PM IST
    Follow us on

    Pawan Kalyan’s ‘Bro’ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న సినిమాలలో కేవలం రెండు మూడు సన్నివేశాలు మరియు ఒక పాట మినహా షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న చిత్రం ‘బ్రో ది అవతార్’. సముద్ర ఖని దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించిన సంగతి అందరికీ తెలిసిందే.

    ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ విడుదలై ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. వచ్చే నెల 28 వ తారీఖున గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా కి సంబంధించిన టీజర్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ అది ఇప్పట్లో వచ్చేలా లేదు కానీ, ఈ సినిమాకి నుండి మరో క్రేజీ న్యూస్ నేడు బయటకి వచ్చింది.

    ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక హాట్ బ్యూటీ పార్టీ లో డ్యాన్స్ వెయ్యాల్సి ఉంటుంది. ఆ పాట కోసం ఇది వరకు శ్రీలీల మరియు రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారిని సంప్రదించింది మూవీ టీం. కానీ వాళ్ళ డేట్స్ ఖాళీ లేకపోవడం తో మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతుల ని సంప్రదించారు. ఆమె వెంటనే ఈ పార్టీ సాంగ్ లో నటించడానికి ఒప్పేసుకుంది. ఈ పాట చేస్తున్నందుకు ఆమె రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు సమాచారం.

    ఇది వరకే ఆమె ఈ ఏడాది ప్రారంభం లో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘బాస్ పార్టీ’ సాంగ్ లో మెగాస్టార్ తో స్టెప్పులేసి అందరి దృష్టిలో పడింది. ఇక రీసెంట్ గా విడుదలైన ఏజెంట్ సినిమాలో కూడా ‘వైల్డ్ సాలె’ అనే పాటలో ఆడిపాడింది. ఇప్పుడు పవర్ స్టార్ తో కలిసి చిందులు వెయ్యబోతుంది, మరి ఈ పాట ఫ్యాన్స్ కి ఏ రేంజ్ లో ఎక్కుతుందో చూడాలి.