https://oktelugu.com/

Bheemla Nayak: భీమ్లా నాయక్ మనసు మారిందా? రిలీజ్ డేట్ చేంజ్ పై నిర్మాతల సమాలోచనలు

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్ లో వస్తున్న భీమ్లా నాయక్ మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ‘భీమ్లా నాయక్’ చిత్రానికి నిర్మాతలు మరో రెండు తేదీలను ఖరారు చేసినట్లు సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి రెండు విడుదల తేదీలను ఎంపిక చేసుకున్నట్లు నిర్మాతలు ట్విట్టర్లొ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : January 23, 2022 / 07:37 PM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్ లో వస్తున్న భీమ్లా నాయక్ మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ‘భీమ్లా నాయక్’ చిత్రానికి నిర్మాతలు మరో రెండు తేదీలను ఖరారు చేసినట్లు సమాచారం.

    రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియన్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి రెండు విడుదల తేదీలను ఎంపిక చేసుకున్నట్లు నిర్మాతలు ట్విట్టర్లొ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘భీమ్లా నాయక్’ సినిమాకు కూడా దర్శక నిర్మాతలు రెండు తేదీలను అనుకుంటున్నారని టాక్. ఇప్పటికే మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ప్రకటించారు. అయితే, ఆ తేదీ కాకుండా ఏప్రిల్ 1వ తేదీని కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

    ఇంకా కొన్ని సీన్స్ షూట్ చేయాల్సి ఉందని ఈ సినిమా టీం చెబుతోంది. అందుకోసం ఈనెల 25 నుంచి మరో షెడ్యూల్ ప్లాన్ చేశారు. పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరి 25నే రిలీజ్ అవుతుంది. క్లిష్ట , పరిస్థితులు కొనసాగితే మాత్రం ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’ చిత్రం విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అప్పటి పరిస్థితులను బట్టి ఒకేరోజు అన్నదమ్ముళ్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయా లేదా అనేది వేచి చూడాల్సిందే.