https://oktelugu.com/

Prabhas-Prashanth Neel : ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో దిల్ రాజు సినిమా..టైటిల్ ఏంటో తెలుసా?

Prabhas-Prashanth Neel : ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలే..ఇటీవలే ఆయన తమిళ హీరో విజయ్ తో ‘వారిసు’ అనే సూపర్ హిట్ సినిమాని తీసి మంచి ఊపు మీదున్నాడు..తెలుగు లో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లే వస్తున్నాయి..ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ తో కలిసి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న దిల్ రాజు, అతి త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి […]

Written By: , Updated On : January 16, 2023 / 10:04 PM IST
Follow us on

Prabhas-Prashanth Neel : ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలే..ఇటీవలే ఆయన తమిళ హీరో విజయ్ తో ‘వారిసు’ అనే సూపర్ హిట్ సినిమాని తీసి మంచి ఊపు మీదున్నాడు..తెలుగు లో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లే వస్తున్నాయి..ప్రస్తుతం రామ్ చరణ్ – శంకర్ తో కలిసి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న దిల్ రాజు, అతి త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకొని రాబోతున్నాడు.

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమాని ఆయన తెరకెక్కించబోతున్నాడట..ఆ మూవీ పేరు ‘రావణం’ అని కూడా అంటున్నారు..త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చెయ్యబోతున్నాడు దిల్ రాజు..ఇప్పటికే ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు చివరి దశకి చేరుకుంది.

ఈ ఏడాది లోనే ఈ సినిమాని విడుదల చెయ్యడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే మరో ప్రాజెక్ట్ వీళ్ళ కాంబినేషన్ లో ప్రకటించడం పై అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు..అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు..సలార్ చిత్రం పూర్తి అవ్వగానే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో తియ్యబోయ్యే మూవీ పై ఫోకస్ పెడుతాడు.

ఆ సినిమా పూర్తి అవ్వగానే ఆయన KGF చాప్టర్ 3 కి షిఫ్ట్ అవుతాడు..ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తర్వాత ప్రభాస్ తో ఉంటుందని సమాచారం..ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సలార్ తో పాటుగా ఆది పురుష్ మరియు ప్రాజెక్ట్ K వంటి సినిమాలు ఉన్నాయి..వీటితో పాటు ఆయన మారుతీ తో మరో సినిమా చేస్తున్నాడు..ఈ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి అయ్యాకే ప్రశాంత్ నీల్ తో రెండవ సినిమా ఉంటుందని సమాచారం.