Homeజాతీయ వార్తలుIAS Officer : ‘ఐఏఎస్ అధికారి ఇంట్లో హల్ చల్’ ఘటనలో సమాధానాలు లేని ప్రశ్నలు...

IAS Officer : ‘ఐఏఎస్ అధికారి ఇంట్లో హల్ చల్’ ఘటనలో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో

IAS Officer : ఆమె ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక కీలక అధికారి. హై ఎండ్ సెక్యూరిటీలో ఉంటారు.. హైదరాబాదులో సంపన్నులు నివసించే ప్రాంతంలో ఉంటారు.. పైగా ఆ ప్రాంతం అంతా పోలీసుల కనుసన్నల్లో ఉంటుంది. అలాంటి ప్రాంతానికి ఓ అపరిచిత వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి రావడం, ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించడం… నేరుగా సదరు అధికారి ఉండే నివాసంలోకి వెళ్లడం.. అంత నమ్మబుల్ గా లేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సదరు అధికారి చేసిన ట్వీట్లను ఆ మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ రీ ట్వీట్ చేశాడని తెలుస్తోంది.. ఈ మాత్రం దానికి ఇంట్లోకి వెళ్లే చనువు ఎలా వస్తుంది? మరీ అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి వెళ్లే ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అతడు రెవెన్యూ ఉద్యోగి కావచ్చు. కానీ సదరు అధికారి సీఎంవో లో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు.. ఎనిమిది సంవత్సరాలుగా ఆ పోస్ట్ లో కొనసాగుతున్నారు. పైగా ఆమె చుట్టూ అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇవన్నీ చేదించుకుని లోపలికి ఎలా వెళ్ళాడు అనేదే ఇక్కడ ప్రశ్న.

ఒకవేళ ఉద్యోగం గురించి మాట్లాడాలి అనుకుంటే ఉదయం కలవొచ్చు. పైగా అతడికి ఉద్యోగ పరమైన సమస్య ఉన్నప్పుడు తన ఉద్యోగ పరిధి రెవెన్యూ శాఖ లోది కాబట్టి.. ఆ శాఖ కార్యదర్శి తో మాట్లాడవచ్చు. పైగా రెవెన్యూ ఉద్యోగులు రంగారెడ్డి జిల్లాలో పని చేయాలి అనుకుంటారు. ఎందుకంటే సిటీకి దగ్గర, పైగా భూ లావాదేవీలు జరుగుతాయి కాబట్టి అమ్యామ్యాలు బాగా దొరుకుతాయి..ఇన్ని లాభాలు ఉన్న జిల్లాలో అతడికి సమస్యలు ఏం ఉంటాయ్? అతడు తహసీల్దార్ కాదు. ఓ డీటీ పెద్దగా వర్క్ ప్రెషర్ కూడా ఉండదు.

అతడు ఆమె ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత కేకలు వేసింది. భద్రతా సిబ్బంది వచ్చి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కానీ అతడు అన్ని హై ప్రొఫెల్ వ్యక్తుల ఇళ్ళు ఉంటే… అందులో సదరు అధికారి ఉంటుందని ఎవరు చెప్పారు? సాధారణంగా హై ప్రొ పైల్ వ్యక్తులు తమ వ్యక్తిగత సమాచారం ఎవరికీ చెప్పరు. పైగా ఆమె సీఎంవో లో పని చేస్తుంది కాబట్టి మరింత గోప్యత ఉంటుంది. ఇన్ని ఉన్నా అతడు ఎలా వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? జాబ్ గురించి మాట్లాడే వాడు అయితే ఎందుకు అఘాయిత్యం చేయబోయాడు అనేది ఇక్కడ అసలు ప్రశ్న. సరే తాను డేర్ మహిళ కాబట్టి అతడి నుంచి తప్పించుకుంది. ఇది కచ్చితంగా నిఘా వైఫల్యం అనుకున్నా… గేటెడ్ కమ్యూనిటీలో ఉండేవాళ్లను ఎవరైనా కలిసేందుకు వస్తే ముందుగా వాళ్లకు ఫోన్ చేస్తారు.. వాళ్లు ఓకే అంటేనే పంపిస్తారు.. మరి సదరు వ్యక్తి వచ్చినప్పుడు నిఘా సిబ్బంది ఏం చేస్తున్నట్టు? వాళ్ళ అనుమతి లేకుండా లోపలికి ఎలా వెళ్లినట్టు? తీరా సదరు అధికారి కేకలు వేస్తే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకున్నారు. అప్పటిదాకా నిద్రపోయారా? సదరు అధికారికి ముందే సమాచారం ఇచ్చారా? ఇవన్నీ ఇప్పుడు తేలాల్సిన ప్రశ్నలు.

ఈ ఘటన జరిగిన వెంటనే చెబితే బాగుండేది.. మీడియాలో వార్త రావడం, రేవంత్ రెడ్డి పొలిటి సైజ్ చేయడంతో ఆమె బయటకు రావాల్సి వచ్చింది..ట్వీట్ ద్వారా ఏదో ఏం జరిగిందో చెప్పింది. దీన్ని బట్టి హై ప్రొఫైల్ పోస్టుల్లో ఉండే వారు ధీమా గా ఉండే రోజులు లేవా? మహిళల భద్రత కోసం కష్టపడుతున్నాం అని చెప్పే ముఖ్యమంత్రి మాటలన్నీ డొల్లేనా?! అందరూ తలుపులు, తాళాలు పడుకునే ముందు పరీక్షించుకోవాలి. అత్యవసరమైతే 100 నెంబర్ కు కాల్ చేయాలి .. అని చెబుతోంది అంటే పరిస్థితి బాగోలేదనే కదా అర్థం..

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular