Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్లిన హీరోలు చాలామంది ఉన్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవికి ఉన్న రేంజ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని మెప్పిస్తుంది… ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత తను స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవిని అప్పటినుంచి ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు. ఆయనను బీట్ చేసే హీరో మరెవరు లేరు అంటూ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి. కారణం ఏంటి అంటే మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ లు వేయడంలో దిట్ట…ఫైటింగ్ లు చేయడంలో ఆయనను మించిన వారు లేరు, నటనలో నవరసాలను అలవోకగా పండించగలిగే కెపాసిటి అతనికి ఉంది.
ఇప్పుడున్న వాళ్ళలో అన్ని క్వాలిటీస్ ఉన్న హీరోలెవరు లేరు. కొందరు డాన్స్ బాగా చేస్తే, మరి కొందరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో అన్ని కలగలిపిన హీరో దొరకనంత వరకు మెగాస్టార్ చిరంజీవిని బీట్ చేసే హీరో ఇండస్ట్రీలో ఎవరు ఉండరనేది వాస్తవం…
వరుసగా 6 ఇండస్ట్రీ హిట్లను దక్కించుకున్న క్రేజ్ కూడా అతనికే దక్కింది. 1987 వ సంవత్సరంలో పసివాడి ప్రాణంతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. 1988లో యముడికి మొగుడు, 1989 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి, 1991 లో గ్యాంగ్ లీడర్, 1992 లో ఘరానా మొగుడు లాంటి సినిమాలను చేశాడు.
ఇక తను వరుసగా ఇలా 6 సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్లు దక్కించుకున్నాడు… ఇక ఇప్పటి వరకు మెగాస్టార్ రేంజ్ ను టచ్ చేసి హీరోలేవరు లేరు ఇక మీదట రాలేరనేది వాస్తవం…ఇక అలాంటి చిరంజీవి ఇప్పటికి మెగాస్టార్ గా ఎందుకు కొనసాగుతున్నారు అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు…