Chiranjeevi CM Dream: తెలుగు వెండితెరపై మెగాస్టార్‌గా వెలుగొందుతున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వయం కృషితో ఎదిగిన హీరో చిరు.. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినప్పటికీ తన కృషితో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు. ఇకపోతే ఆయన మధ్యలో కొద్ది రోజుల పాటు రాజకీయాల్లోకి వెళ్లారు. అయితే, ఆ తర్వాత కాలంలో మళ్లీ సినీ రీ ఎంట్రీ ఇచ్చేశారు. ‘ఖైదీ నెం.150’ సినిమాతో చిరు..తన స్టామినా చూపించారు. అయితే, చిరంజీవిని రాజకీయాల్లోకి వచ్చేలా చేసిన ఆ సినిమా గురించి తెలుసుకుందాం.
‘ప్రేమే మార్గం, సేవే లక్ష్యం’ అనే నినాదంతో మెగాస్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం పార్టీ’ని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. అయితే, 2008లో చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి బీజం చాలా ఏళ్ల కిందటే ఆ సినిమా ద్వారా పడిందని సినీ వర్గాలు చర్చించుకుంటుంటాయి. ఆ సినిమా ఏంటంటే.. ‘ముఠామేస్త్రీ’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఏ.కోదండరామిరెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసును షేక్ చేసిన సంగతి అందరికీ విదితమే. వీరి కాంబోలో వచ్చిన పిక్చర్స్ అన్నీ కూడా దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి. కాగా, ‘కొండవీటి దొంగ’ మూవీ తర్వాత వీరి కాంబో మళ్లీ రిపీట్ కాలేదు.
ఈ క్రమంలోనే డైరెక్టర్ కోదండరామిరెడ్డి, చిరంజీవి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని ప్రచారం జరిగింది. కానీ, అవి నిజం కాదని వీరు నిరూపించారు. 1993లో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ముఠా మేస్త్రీ’ చిత్రం విడుదలైంది. ఇందులో మార్కెట్ యార్డులో పని చేసే సాధారణ కూలిగా చిరు.. కనిపిస్తారు. ఈయన సినిమా పాత్ర ప్రకారం.. ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో చిరు సరసన హీరోయిన్స్‌గా మీనా, రోజా నటించారు.
Also Read: చిరంజీవిని తీసిపారేశాడే? సినీ ఇండస్ట్రీని అవమానించేలా పేర్నీ నాని తీరు..
అలా చిత్రంలో ముఖ్యమంత్రి పాత్ర పోషించిన చిరంజీవిని నిజ జీవితంలోనూ ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు మెగా అభిమానులు. అలా చిరంజీవి సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని భావించారని అప్పట్లో టాక్ ఉండేది. ‘ముఠా మేస్త్రీ’ ఫిల్మ్‌లో చివరలో చిరంజీవి చెప్పిన డైలాగ్.. ‘మళ్లీ ఎప్పుడైనా ప్రజాస్వామ్యానికి ప్రమాదం వాటిల్లితే పిలవండి.. స్పీడై పోతా..’ బాగా పాపులర్ అయింది.
ఈ డైలాగ్ విన్న మెగా అభిమానులు అప్పటి నుంచి చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నారు. సినిమా ఫంక్షన్స్‌లోనూ చిరు కాబోయే ముఖ్యమంత్రి అని నినదించారు. అలా చిరంజీవి కూడా తర్వాత కాలంలో రాజకీయాల్లోకి రావాలనుకుని నిర్ణయించుకుని పార్టీ పెట్టారు. అయితే, తర్వాత కాలంలో ఏర్పడ్డ రాజకీయ పరిణామాల దృష్ట్యా చిరంజీవి.. తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం మళ్లీ సినీ రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రజెంట్ హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు.
Also Read: మెగాస్టార్‌కు డూప్ గా నటించేది ఎవరో తెలుసా? 30 ఏండ్లుగా ఒక్కడే…