Chiranjeevi Vs Balakrishna: కొంతమంది స్టార్ హీరోల మధ్య ఎప్పటికప్పుడు పోటీ ఉంటూనే వస్తుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి – నందమూరి బాలకృష్ణ ల మధ్య పోటీ అనేది గత 50 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పటికీ వీళ్లిద్దరి మధ్య పోటీ ఉంది అంటే నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్లు ఒకరి మీద ఒకరు పై చేయి సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. రాబోయే సినిమాలతో కూడా భారీ పోటీ అయితే పెట్టుకుంటున్నారు. స్టార్ హీరోలు ఎంతోమంది వచ్చిన టైర్ వన్ హీరోలు సైతం పాన్ ఇండియాలో సంచలనాలను క్రియేట్ చేస్తున్నప్పటికి ఈ ఇద్దరు హీరోల మధ్య పోటీ మాత్రం తప్పడం లేదు.
వీళ్ళ సినిమాలు పోటీ పడుతున్నాయి అంటే చాలు ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఉత్సాహం అయితే కలుగుతుంది. ఇక ఇందులో ఎవరు పై చేయి సాధిస్తారు ఎవరు డౌన్ అయిపోతారు అనే దాని మీదనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి – బాలయ్య బాబుని చాలాసార్లు డామినేట్ చేస్తూ వచ్చాడు.
కొన్ని సందర్భాల్లో బాలయ్య కూడా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసే సినిమాలను చేస్తూ చిరంజీవిని డామినేట్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా సినిమా ఇండస్ట్రీ బాగుండాలి అంటే మాత్రం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు మంచి సినిమాలను చేయాలి. అలాగే వాళ్ళ మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికి అది పర్సనల్గా కాకుండా సినిమాల పరంగా ఉంటే బాగుంటుందని మరి కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఇప్పటివరకు మాస్ లో ఎవ్వరికి రాని గుర్తింపు వీళ్ళిద్దరు చేసిన సినిమాలతో తెచ్చుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం…కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిన ఈ ఇద్దరు హీరోలు ఎవరికి వారే సాటి అంటూ వాళ్ళ అభిమానుల్లో భారీ గుర్తింపునైతే తెచ్చుకున్నారు…ఇలాంటి హీరోలు మరోసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే ఆ పోటీ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మాత్రం వచ్చే సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే…
