Renu Desai : ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ అయిన వాళ్లు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వారిలో రేణు దేశాయ్ ఒకరు. పవన్ కల్యాణ్ తో ఒకే ఒక్క సినిమా ‘బద్రి’లో నటించిన రేణు ఆ తరువాత మరోసారి పవన్ తో కలిసి ‘జానీ’లో కనిపించారు. మళ్లీ ఆ తరువాత ఇంకో హీరో పక్కన నటించలేదు. అదే సమయంలో పవన్ కల్యాణ్ తో లవ్లో పడడం.. ఆ తరువాత పెళ్లి చేసుకోవడం.. కొన్నాళ్ల తరువాత విడిపోవడం.. ఇలారేణు దేశాయ్ లైఫ్ లో అన్నీ చకాచకా జరిగిపోయాయి. పవన్ తో విడిపోయిన తరువాత కూడా రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తో నిత్యం సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తూ అలరిస్తున్నారు. రీసెంట్ గా ఈమె రవితేజ ‘టైగర్ నాగేశ్వర్ రావు’ అనే చిత్రంలో కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ఆస్తుల గురించి విషయాలు ఆసక్తి రేపుతున్నాయి.
పూణెకు చెందిన రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ ను పెళ్లి చేసుకొని.. ఆ తరువాత విడిపోయిన తరువాత హైదరాబాద్ లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమె రవితేజ హీరోగా వచ్చిన ‘టైగర్ నాగేశ్వర్ రావు’ సినిమాలో లవణం అనే పాత్రలో కనిపించారు. చాన్నాళ్ల తరువాత రేణు దేశాయ్ వెండితెరపై కనిపించడంతో ప్రత్యేకంగా ఆమె గురించి చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె పవన్ నుంచి విడిపోయిన తరువాత ఆదాయం ఎలా వస్తుంది? ఎలా జీవిస్తున్నారు? అనే చర్చ వచ్చింది. వాస్తవానికి రేణు దేశాయ్ కోటీశ్వరురాలు అని చాలా మందికి తెలియని విషయం.
పవన్ నుంచి విడిపోయిన తరువాత ఆయన రేను దేశాయ్ కి భారీగా భరణం ఇచ్చారన్న ప్రచారం సాగింది. కానీ పవన్ నుంచి తాను ఒక్క రూపాయి కూడా భరణం తీసుకోలేదని తేల్చి చెప్పింది. అయితే భరణం తీసుకోకపోయినా ఆమె టీవీ షోల్లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. అంతేకాకుండా సినిమాల్లోకి రాకముందే కాస్ట్యూమ్ డిజైనర్ అయినా రేణు దేశాయ్ తన వృత్తిని అలాగే కొనసాగిస్తుందని కొందరు అంటున్నారు.
అయితే రేణుదేశాయ్ కి వారసత్వంగా వచ్చిన ఆస్తులుబాగానే ఉన్నాయి. తన తాత సంపాదించిన ఆస్తుల్లో రేణు దేశాయ్ కి వాటా ఉంది.అలాగే రేణు దేశాయ్ సొంతంగా హైదరాబాద్ లో ఓ ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేసింది. ఇలా మొత్తంగా కలిపి ఆమెకు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ నుంచి విడిపోయిన తరువాత రేణు దేశాయ్ కి ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వారికి జన్మించిన కుమారుడు, కుమార్తెను పవన్ చదివిస్తున్నట్లు సమాచారం.