Rahul Chandrababu: ఏదో జరుగుతోంది.. సమ్ థింగ్ ఈజ్ రాంగ్.. ఒకేసారి ఒక జాతీయ నాయకుడు.. ఒక ప్రాంతీయ నాయకుడు విదేశీ పర్యటనలకు వెళ్లారు. అదీ ఒకే సమయంలో.. అదిప్పుడు చర్చనీయాంశమైంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత పర్యటనలో ఉన్నారని.. కొత్త సంవత్సరం వేడుకలు ముగిసిన వెంటనే తిరిగి వస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ జనవరి 3న పంజాబ్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగిచనున్నారు. అయితే ప్రస్తుతం ఆయన దేశంలో లేరు. విదేశీ పర్యటనలో ఉన్నారు. దీనిపై ఆరాతీయగా.. విదేశీ పర్యటన ఆయన వ్యక్తిగత వ్యవహారం అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ ఈ రహస్య పర్యటనపై అధికార బీజేపీ నేతలు పలు ప్రశ్నలు లేవనెత్తుతూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఏపీలో సీజ్ చేసిన సినిమా థియేటర్లు తెరుస్తున్న ప్రభుత్వం.. దీనివెనుక పీపుల్స్ స్టార్
రెండు నెలల క్రితమే రాహుల్ గాంధీ ఎక్కడికి వెళుతున్నది చెప్పకుండా ఇలానే ప్రైవేటు పర్యటన పేరిట విదేశాలకు వెళ్లారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభానికి ఒక్కరోజు ముందు మాత్రమే ఆయన తిరిగి వచ్చారు.
ఇప్పుడు తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం వ్యక్తిగత పర్యటన పేరిట విదేశాలకు వెళ్లారు. 2019లో కూడా ఇలానే చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లడం విశేషం. 2020లో కరోనా లాక్ డౌన్ వేళ రాజకీయాలకు విరామం తీసుకొని హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమయ్యారు.
తాజాగా చంద్రబాబు, రాహుల్ గాంధీలు తమ వ్యక్తిగత పర్యటనలు అంటూ విదేశాలకు చెక్కేశారు. ఎక్కడికి వెళ్లింది? ఎందుకోసం అన్నది చెప్పలేదు. అదే ఇప్పుడు అనుమానాలకు దారితీస్తోంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు-రాహుల్ గాంధీ ఇద్దరూ కలిసి పనిచేశారు. మోడీని దించేసి రాహుల్ ను ప్రధానిని చేయడానికి చంద్రబాబు దేశమంతా తిరిగి మద్దతు కూడగట్టారు. మోడీకి వ్యతిరేకంగా ఉమ్మడి సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియాతోపాటు పాల్గొన్నారు.
కానీ బ్యాడ్ లక్.. మోడీనే గెలిచాడు.. రాహుల్ , చంద్రబాబు ఓడిపోయారు. ఏపీలో జగన్ అఖండ విజయం సాధించారు. ఇప్పుడు 5 ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికలకు ముందు.. ఉత్తరాది నుంచి రాహుల్ గాంధీ, దక్షిణాది నుంచి చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారు. రాహుల్ గాంధీ కోసం బీజేపీ శ్రేణులు ఆరాతీస్తుండగా.. చంద్రబాబు ఆచూకీ కోసం వైసీపీ నేతలు శూలశోధన చేస్తున్నారు.
చూస్తుంటే.. తమతమ రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు రాహుల్, చంద్రబాబు ఇద్దరూ వ్యూహరచన చేసేందుకు దేశం వెలుపల రహస్య సమావేశం నిర్వహిస్తున్నట్టు పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. అయితే అక్కడ మోడీ.. ఇక్కడ జగన్ బలంగా ఉండడంతో వీరు విదేశాలకు వెళల్ి వ్యూహరచన చేసినా గెలుపు కష్టమేనన్న భావన కలుగుతోంది.
Also Read: డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన తారక్.. అసలు ఏం జరిగిందంటే?