PM Modi- Chandrababu: చంద్రబాబుపై మోడీ ప్రేమ పొంగిపాయే.. పచ్చ మీడియా కళ్లు చల్లబడే.!

PM Modi- Chandrababu: ఎన్నడూ చూడని కళ్లు ఆప్యాయంగా చూసేసరికి ఆ మీడియా కళ్లు చల్లబడ్డాయి.. పెద్దాయన చంద్రబాబు వద్దకు వచ్చి ఓ 5 నిమిషాలు మోడీ పక్కకు తీసుకెళ్లి మాట్లాడేసరికి అందరి కడుపులు చల్లబడ్డాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇదే చంద్రబాబు ఏకంగా మోడీని గద్దె దించాలని తన బద్దశత్రువైన కాంగ్రెస్ తో జత కట్టాడు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఎక్కని ఫ్లైట్ లేదు. తొక్కని గడపలేదు. దేశమంతా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని […]

Written By: NARESH, Updated On : August 7, 2022 11:16 am
Follow us on

PM Modi- Chandrababu: ఎన్నడూ చూడని కళ్లు ఆప్యాయంగా చూసేసరికి ఆ మీడియా కళ్లు చల్లబడ్డాయి.. పెద్దాయన చంద్రబాబు వద్దకు వచ్చి ఓ 5 నిమిషాలు మోడీ పక్కకు తీసుకెళ్లి మాట్లాడేసరికి అందరి కడుపులు చల్లబడ్డాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇదే చంద్రబాబు ఏకంగా మోడీని గద్దె దించాలని తన బద్దశత్రువైన కాంగ్రెస్ తో జత కట్టాడు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఎక్కని ఫ్లైట్ లేదు. తొక్కని గడపలేదు. దేశమంతా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మరీ ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి రాజకీయం పండించాడు. కట్ చేస్తే చంద్రబాబు దారుణంగా ఓడిపోయాడు.. మోడీ ఘనంగా గెలిచాడు.40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు పతనం అప్పుడే స్ట్రాట్ అయ్యింది.

PM Modi- Chandrababu

2019లో మోడీ మరింత శక్తవంతంగా మారారు. క్లియర్ కట్ మెజార్టీ సాధించి దేశంలో పవర్ ఫుల్ వ్యక్తిగా రూపాంతరం చెందారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందాడు. అయితే చంద్రబాబు 23 అసెంబ్లీ సీట్లకే పరిమితమై బొక్క బోర్లా పడ్డాడు. జగన్ చేతిలో చావుదెబ్బ తిన్నారు. జగన్ నయా పాలిటిక్స్ కంటతడి పెట్టుకున్నారు. బోరున విలపించారు. అంత పెద్ద మనిషి అలా చిన్న పిల్లాడిలో ఏడ్చేసరికి జాతీయ వార్త అయ్యింది. మోడీ, అమిత్ షాలు కూడా ఈ పెద్దాయనతో ప్రతీకారం ఎందుకని వదిలేసినట్టున్నారు.

Also Read: NITI Aayog- KCR: కేసీఆర్ కు కౌంటర్ కోసం ఏకంగా నీతి అయోగ్ నే దిగిందే?

రాజకీయాలు అన్నాక శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. అది ఒంటపట్టించుకున్న నేతలు భవిష్యత్ అవసరాల దృష్ట్యా అందరినీ కౌగిలించుకుంటారు. పగోడు అయినా సరే పలకరిస్తారు. ఇప్పుడు అదే అయ్యింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట రాష్ట్రపతి భవన్ లో సమావేశం జరిగింది. దీనికి పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖ ప్రతిపక్షాల నేతలు హాజరయ్యారు. చంద్రబాబును పిలవడంతో ఆయన వెళ్లారు.

ఇక చంద్రబాబు దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిసేపు పక్కకు తీసుకెళ్లి మోడీ మాట్లాడారు. ఏం మాట్లాడారన్నది అటు మోడీ చెప్పరు. ఇటు చంద్రబాబు లీక్ చేయరు. కానీ పచ్చ మీడియా మాత్రం పండుగ చేసుకున్నది. అధికారం కోల్పోయిన చంద్రబాబు తరుఫున వకాల్తా పుచ్చుకొని.. నాడు మోడీకి వ్యతిరేకంగా పచ్చ మీడియా రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. కానీ దేశంలో బీజేపీ రోజురోజుకు బలపడడం.. చంద్రబాబు పరిస్థితి తీసికట్టుగా మారడం.. మోడీ కరుణ కోసం చంద్రబాబు, పచ్చ మీడియా వేయికళ్లతో ఎదురుచూసింది.

PM Modi- Chandrababu

ఆ రోజు రానే వచ్చింది. తాజాగా మోడీ ఆహ్వానం పంపడం ఆలస్యం చంద్రబాబు ఢిల్లీలో వాలిపోయారు. పిలిస్తే వచ్చాడని మోడీ ఆప్యాయంగా పలకరించారు. ‘అప్పుడప్పుడు ఢిల్లీ రావాలని.. ఇది మీ ఇల్లు అనుకోండి.. ఎప్పుడొచ్చినా అపాయింట్ మెంట్ ఇస్తానంటూ’ మోడీ అన్నాడని పచ్చమీడియా రాసుకొచ్చింది.

అయితే ఇదే తేడా కొడుతోంది. ఎందుకంటే గత మూడేళ్లలో.. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ కనీసం అపాయింట్ మెంట్ కూడా చంద్రబాబుకు ఇవ్వలేదు. స్వాతంత్ర్య ఉత్సవాల్లో పిలవడం.. ఓ 5 నిమిషాలు మాట్లాడడంతో చంద్రబాబు, అనుకూలమీడియా పండుగ చేసుకుంది. చంద్రబాబుకు భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. కానీ అక్కడంత సీన్ జరగలేదని మిగిలిన వాళ్లు అంటున్నారు. మోడీతో మీటింగ్ కోసం మూడేళ్లుగా చంద్రబాబు వెయిట్ చేస్తున్నారంటే ఆయన కళ్లు కాయలు కాసి పండ్లు అయిపోయాయి.. ఎట్టకేలకు కలవడంతో బాబు గారు, ఆయన అనుకూల మీడియా ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి.

Also Read:CM Jagan: ఆ ఐదుగుర్ని అసెంబ్లీ గేటు తాకనివ్వనంటున్న సీఎం జగన్.. సాధ్యమేనా?

Tags