https://oktelugu.com/

Tollywood Hero Affair: హీరోయిన్ తో ఆ హీరోకు ఎఫైర్.. కేవలం తాత్కాలికమేనట?

Tollywood Hero Affair: ఈ కాలంలో షర్ట్ మార్చినంత సులువుగా బంధాలను మార్చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి చాటుమాటు వ్యవహారాలకు కొదవే లేదు. చాలా ఎఫైర్లు గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంటాయి. అవకాశాల కోసం హీరోయిన్లు ‘కాంప్రమైజ్’ అవుతారని.. హీరోలు, దర్శకులు, నిర్మాతలకు లొంగిపోతారన్న ప్రచారం ఎప్పటి నుంచో టాలీవుట్ లో ఉంది. అందరూ కాకున్నా కొందరు ఇలా చేసిన వారే అని  ‘మీటూ’ ఉద్యమంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా టాలీవుడ్ లో ఓ ఎఫైర్ బయటపడింది. […]

Written By: , Updated On : November 18, 2021 / 04:12 PM IST
Follow us on

Tollywood Hero Affair: ఈ కాలంలో షర్ట్ మార్చినంత సులువుగా బంధాలను మార్చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి చాటుమాటు వ్యవహారాలకు కొదవే లేదు. చాలా ఎఫైర్లు గుట్టు చప్పుడు కాకుండా సాగుతుంటాయి. అవకాశాల కోసం హీరోయిన్లు ‘కాంప్రమైజ్’ అవుతారని.. హీరోలు, దర్శకులు, నిర్మాతలకు లొంగిపోతారన్న ప్రచారం ఎప్పటి నుంచో టాలీవుట్ లో ఉంది. అందరూ కాకున్నా కొందరు ఇలా చేసిన వారే అని  ‘మీటూ’ ఉద్యమంలో ఆరోపణలు వెల్లువెత్తాయి.

hero affair

hero affair

తాజాగా టాలీవుడ్ లో ఓ ఎఫైర్ బయటపడింది. అది ఆ నోటా ఈనోటా ప్రచారం సాగుతోంది. నిప్పు లేనిదే పొగ రాదు కదా.. ఇప్పుడు మన యువ హీరో ఎఫైర్ ముచ్చట అలాగే వ్యాప్తి చెందుతోంది.

యువ హీరో తన బోల్డ్ యాక్టింగ్ స్టైల్ తో టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించాడు. కొన్ని ఓటీటీ సినిమాలు అతడిని ‘యూత్ ఫుల్’ కంటెంట్ కు హాట్ షాట్ నటుడిని చేశాయి. ప్రస్తుతం చాలా ప్రాజెక్టులతో ఈ యువ హీరో బిజీగా ఉన్నాడు.

ఈ యువ హీరో తన రెండు సినిమాల్లోని హీరోయిన్లతో డేటింగ్ చేశాడని గతంలో ఒక రూమర్ గట్టిగా వినిపించింది. అయితే తాజాగా ఈ రిలేషన్ షిప్ నుంచి అతడు తప్పుకున్నట్లు సమాచారం. ఆ హీరోయిన్ తో కేవలం ఆన్ ఆఫ్ ఎఫైర్ పెట్టుకున్నాడట.. సినిమాల్లో నటించేవరకే ఆ ఎఫైర్ నడుస్తుందట.. ఆ తర్వాత ఎవరిదారి వారిదేనట..

తాజాగా ఈ యువ హీరో మరో హీరోయిన్ తో నటించడం ప్రారంభించినట్లు సమాచారం. ఈ కొత్త హీరోయిన్ తో అతడి సాన్నిహిత్యం గురించి ఇప్పుడు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ కొత్త ఎఫైర్ గురించి అతడి పాత ‘ఆన్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్’కు తెలుసా? తెలిస్తే ఏం జరుగుతుంది? ఈ రెండు రిలేషన్లు అతడు కొనసాగిస్తాడా? లేక బ్రేకప్ అవుతుందా? మొదటి గర్ల్ ఫ్రెండ్ కు ఈ రెండో ఎఫైర్ తో అభ్యంతరాలు లేవా? అన్న గుసగుసలు ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.