Boyapati Srinu Next Movie: భద్ర సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన బోయపాటి శ్రీను ఆ తర్వాత చేసిన వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా సక్సెస్ లను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో కొంతవరకు తడబడ్డ ఆయన రాబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక వరుసగా అతనికి రెండు ఫ్లాపులైతే వచ్చాయి. స్కంద, అఖండ 2 రెండు సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్న బోయపాటి ఇప్పుడు చేయబోయే సినిమాతో భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన వెంకటేష్ తో ఒక సినిమా చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లో తులసి సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది.
ఇప్పుడు మాత్రం వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎలాంటి మూవీ రాబోతుంది దర్శకుడు అతన్ని ఎలా చూపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇంకా ఈ ప్రాజెక్టు అఫీషియల్ గా అనౌన్స్ కాలేదు. ఇక ఇప్పటికే వెంకటేష్ త్రివిక్రమ్, అనిల్ రావిపూడి డైరెక్షన్లో సినిమాలైతే చేస్తున్నాడు.
ఈ సినిమాలు పూర్తయిన తర్వాత తన తదుపరి సినిమా మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక బోయపాటి మాత్రం వెంకటేష్ ను దృష్టిలో పెట్టుకొని ఒక కథనైతే సిద్ధం చేస్తున్నాడట. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకి వెళ్లి అవకాశాలైతే ఉన్నాయి. బోయపాటి అనుకున్నట్టుగానే ఈ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలుపుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
మొత్తానికైతే బోయపాటి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. లేకపోతే మాత్రం ఆయనకు స్టార్ హీరోల నుంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే లేవు. మరి ఇప్పటికైనా ఆయన రొటీన్ రొట్ట ఫార్ములాను వదిలేసి కొత్త మేకింగ్ తో ప్రేక్షకులను అలరిస్తే బాగుంటుందని మరి కొంతమంది భావిస్తున్నారు…
