https://oktelugu.com/

KGF2 : బాలీవుడ్ ను షేక్ చేస్తున్న సౌత్ ఇండియా.. కేజీఎఫ్ హిట్ అయితే ఖతమే!

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అందరూ ‘బాలీవుడ్’ను చూపించేవారు. హిందీ సినిమాలు అలా ఆడేవి. దక్షిణాది భాషల సినిమాలకు అసలు ప్రాధాన్యమే ఉండేది కాదు.. కానీ కాలం మారింది. తెలుగు నుంచి వచ్చిన ‘బాహుబలి’ తొలి ప్యాన్ ఇండియా మూవీగా రికార్డులు కొల్లగొట్టింది. కోట్ల కలెక్షన్ల వర్షం కురిసింది. దీంతో బాలీవుడ్ సినీ జనాలకు భయం పట్టుకుంది. హిందీ సినిమాల్లో వీక్ కంటెంట్ రావడం.. షారుఖ్ లాంటి హీరో గత ఐదేళ్లుగా ఒక్క హిట్ కూడా లేకుండా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 11, 2022 / 05:22 PM IST
    Follow us on

    ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే అందరూ ‘బాలీవుడ్’ను చూపించేవారు. హిందీ సినిమాలు అలా ఆడేవి. దక్షిణాది భాషల సినిమాలకు అసలు ప్రాధాన్యమే ఉండేది కాదు.. కానీ కాలం మారింది. తెలుగు నుంచి వచ్చిన ‘బాహుబలి’ తొలి ప్యాన్ ఇండియా మూవీగా రికార్డులు కొల్లగొట్టింది. కోట్ల కలెక్షన్ల వర్షం కురిసింది. దీంతో బాలీవుడ్ సినీ జనాలకు భయం పట్టుకుంది.

    KGF2 in Greece

    హిందీ సినిమాల్లో వీక్ కంటెంట్ రావడం.. షారుఖ్ లాంటి హీరో గత ఐదేళ్లుగా ఒక్క హిట్ కూడా లేకుండా సినిమాలు చేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక విలక్షణ చిత్రాలు తీసే అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోకు ఫ్లాపులు వచ్చాయి. సల్మాన్ ఖాన్ సినిమాలు హిట్ అయినా అంతంతే.. కానీ దక్షిణాది చిత్రాలు ఇప్పుడు హిందీ మార్కెట్ ను ఏలుతున్నాయి.. షేక్ చేస్తున్నాయి.

    బాహుబలి తర్వాత వచ్చిన ‘పుష్ప’ మూవీ బాలీవుడ్ ను షేక్ చేసింది. కరోనా కల్లోలం తగ్గిన తర్వాత విడుదలైన ఈ సినిమా హిందీ జనాలకు బాగా నచ్చింది. ప్రముఖ క్రికెటర్లు సెలబ్రెటీలు కూడా ‘తగ్గేదేలే’ అని సోషల్ మీడియాలో అనడం.. ‘శ్రీవల్లీ’ , ఊ అంటావా పాటలకు చిందేయడంతో పుష్ప మేనియా బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించింది.

    ఇప్పుడు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టి ఏకంగా 1000 కోట్లు సాధించింది. ఇప్పుడు ప్యాన్ ఇండియా సినిమాలంటే దక్షిణాది సినిమాలే అన్నట్టుగా మారింది. హిందీ సినిమాల్లో కంటెంట్ లేకపోవడం.. అక్కడి జనాలకు నచ్చకపోవడంతో మన దక్షిణాది సినిమాలనే ఆదరిస్తున్నారు.

    ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో షేక్ అయిన బాలీవుడ్ మార్కెట్ ను మరింతగా ‘కేజీఎఫ్2’ భయపెడుతోంది. ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక బాలీవుడ్ జనాలకు, అక్కడి మీడియాకు నిద్రపట్టదు. అందుకే కేజీఎఫ్2 ఫలితం కోసం అక్కడి మీడియా కాచుకు కూర్చుంది. కేజీఎఫ్ 2 గ్రాండ్ హిట్ అయితే మాత్రం బాలీవుడ్ మార్కెట్ మరింత దిగజారి దక్షిణాది సినిమాలే అక్కడ రాజ్యమేలడం ఖాయం. ఈ మేరకు బాలీవుడ్ దర్శకులు, నిర్మాతల చూపు కేజీఎఫ్2పై పడింది. ఈ సినిమా ఆడితే ఇక ఇండియన్ సినిమా కాస్త ‘సౌత్ ఇండియా సినిమా’గా మారిపోతుందన్న భయాలు హిందీ జనాలను వెంటాడుతోంది.