Ravi Teja Biography : అప్పుడు త్రిబుల్ బెడ్ రూప్ ప్లాట్ ఉంటే చాలనుకున్నాడు.. ఇప్పుడు రవితేజ ఉండే ఇంటి ఖరీదు ఎన్ని కొట్లో తెలుసా!

Ravi Teja Biography : ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన నటులు చాలా తక్కువ ఉంటారు. అందులోనూ స్టార్ హీరో కావడమంటే చిన్న విషయం కాదు. ఈ కోవకు చెందిన అరుదైన నటుడు రవితేజ. సినిమానే ఊపిరిగా బ్రతికిన రవితేజ లైట్ బాయ్ నుండి పరిశ్రమలో దొరికిన ప్రతి పనీ చేశాడు. ఏళ్ల తరబడి అవకాశాల కోసం ఎదురు చూశాడు. వ్యాంప్, కమెడియన్, సైడ్ హీరో, సెకండ్ హీరో, విలన్, సపోర్టింగ్ యాక్టర్ ఇలా అన్ని రకాల పాత్రలు […]

Written By: NARESH, Updated On : January 29, 2023 1:13 pm
Follow us on

Ravi Teja Biography : ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన నటులు చాలా తక్కువ ఉంటారు. అందులోనూ స్టార్ హీరో కావడమంటే చిన్న విషయం కాదు. ఈ కోవకు చెందిన అరుదైన నటుడు రవితేజ. సినిమానే ఊపిరిగా బ్రతికిన రవితేజ లైట్ బాయ్ నుండి పరిశ్రమలో దొరికిన ప్రతి పనీ చేశాడు. ఏళ్ల తరబడి అవకాశాల కోసం ఎదురు చూశాడు. వ్యాంప్, కమెడియన్, సైడ్ హీరో, సెకండ్ హీరో, విలన్, సపోర్టింగ్ యాక్టర్ ఇలా అన్ని రకాల పాత్రలు చేశారు. అతని కష్టానికి తగిన గుర్తింపు దక్కింది. నిరీక్షణకు తగిన ఫలితం లభించింది. ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఇడియట్, ఖడ్గం వంటి చిత్రాలు ఆయన్ని హీరోగా నిలబెట్టాయి.

స్టార్ హీరోగా ఎదిగి కోట్లు తీసుకునే రేంజ్ కి వెళ్ళాడు. ఒకప్పుడు చిరంజీవి సినిమాల్లో చిన్న పాత్ర చేసిన రవితేజ ఆయనతో పాటు హీరోగా స్క్రీన్ షేర్ చేసుకునే స్థాయికి చేరారు. రవితేజ ఈ స్థాయికి వస్తారని ఆయనకు కూడా నమ్మకం లేదు. ఈ విషయాన్ని ఆయనతో మొదటి నుండి జర్నీ చేసిన ఓ సీనియర్ నటుడు వెల్లడించారు. హీరో కాకముందు రవితేజ ఎలా ఉండేవారో? ఆయన కోరికలు ఎలా ఉండేవో? ఆయన తెలియజేశారు.

రవితేజ ఎప్పుడూ ఎనర్జిటిక్ గా ఉండేవాడు. అదే ఎనర్జీ ఇప్పటికీ మైంటైన్ చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు. అప్పట్లో రవితేజ కొంచెం బొద్దుగా ఉండేవాడు. వ్యాయామం చేసి సన్నబడ్డారు. హైదరాబాద్ లో త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొంటే చాలు, పరిశ్రమకు వచ్చినందుకు ఎంతో కొంత సాధించినట్లే అని రవితేజ భావించేవారట. అయితే ఇప్పుడు ఆయన ఉంటున్న ఇల్లు ఖరీదు అక్షరాల రూ. 12 కోట్లు అని సమాచారం. రవితేజ ప్రస్తుత ఒక మూవీ రెమ్యూనరేషన్ తో పదికి పైగా త్రిబుల్ బెడ్ రూమ్ ప్లాట్స్ కొనచ్చు.

కృషితో అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని రవితేజ నిరూపించారు. నమ్ముకున్న వృత్తిని వదలకుండా సహనంగా ఎదురుచూసి ప్రయత్నం చేసి సక్సెస్ కావచ్చని చెప్పడానికి రవితేజ జీవితం బెస్ట్ ఎగ్జామ్ ఫుల్. ఇటీవల సక్సెస్ లేక ఇబ్బంది పడ్డ రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో ఫార్మ్ లోకి వచ్చారు. ధమాకా సూపర్ హిట్ కొట్టింది. వాల్తేరు వీరయ్య ఇండస్ట్రీ హిట్ వైపుగా దూసుకెళుతోంది. రవితేజ చిరంజీవి తమ్ముడిగా కీలక రోల్ చేశారు. ఇక రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు రవితేజ అప్ కమింగ్ చిత్రాల లిస్ట్ లో ఉన్నాయి. నూతన దర్శకుడితో ఓ మూవీ ప్రకటించారు.