Bigg Boss 6 Telugu Final : టైటిల్ విన్నర్ రేవంత్ కాదా..? చివరి నిమిషం లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss 6 Telugu Final : ఎన్నో భారీ అంచనాలతో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఈరోజుతో గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది..ఎంతో మంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎలిమినేషన్స్ తర్వాత హౌస్ లో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ గా శ్రీహాన్ , రేవంత్ , కీర్తి , ఆది రెడ్డి మరియు రోహిత్ నిలిచారు..ఈ 5 మంది ఇంటి సభ్యులలో ఎవరు టైటిల్ గెలుచుకొని 50 లక్షల రూపాయిల క్యాష్ ప్రైజ్ తో పాటుగా […]

Written By: NARESH, Updated On : December 18, 2022 12:33 pm
Follow us on

Bigg Boss 6 Telugu Final : ఎన్నో భారీ అంచనాలతో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 6 ఈరోజుతో గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది..ఎంతో మంది స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎలిమినేషన్స్ తర్వాత హౌస్ లో ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ గా శ్రీహాన్ , రేవంత్ , కీర్తి , ఆది రెడ్డి మరియు రోహిత్ నిలిచారు..ఈ 5 మంది ఇంటి సభ్యులలో ఎవరు టైటిల్ గెలుచుకొని 50 లక్షల రూపాయిల క్యాష్ ప్రైజ్ తో పాటుగా పాతిక లక్షలు విలువ చేసే ఫ్లాట్, కారు గెలుచుకోబోతున్నారో తెలియాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే.

ఈ ఫినాలే వీక్ లో జరిగిన ఓటింగ్ ప్రకారం రేవంత్ అందరికంటే ఎక్కువ ఓట్లతో డబుల్ మార్జిన్ తో ఆధిక్యత చూపిస్తున్నాడు.. కానీ అంతా సజావుగా సాగిపోతే అది బిగ్ బాస్ షో ఎందుకు అవ్వుద్ది..ముందు ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్స్ ఎంత అన్యాయంగా జరిగాయో అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు..ఈ సీజన్ మీదనే విరక్తి కలిగించేలా చేశాయి ఆ ఎలిమినేషన్స్.

ఇప్పుడు టైటిల్ విన్నర్ లో కూడా అలాగే జరగబోతుందని ఒక సమాచారం కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి లీక్ అయ్యింది. .అది ఈరోజు మూడు గంటల సమయంలో తెలియబోతుందట..ముందుగా రేవంత్ టైటిల్ విన్నర్ గా, శ్రీహాన్ రన్నర్ గా నిలిచారనే వార్త సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం అయ్యింది.. కానీ ఇక్కడే ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయ్యే ట్విస్ట్ ఉండబోతుంది అంటున్నారు..రోహిత్ టాప్ 5 స్థానంలో ఎలిమినేట్ అవ్వగా.. ఆది రెడ్డి టాప్ 4 కంటెస్టెంట్ గా బయటకి వచ్చేశారు.

వాళ్లిద్దరూ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత రేవంత్ , శ్రీహాన్ మరియు కీర్తి టాప్ 3 కంటెస్టెంట్స్ గా నిలిచారు.. వీరిలో రేవంత్ కాకపోతే శ్రీహాన్ కి టైటిల్ గెలుచుకునే ఛాన్స్ ఉంది.. వీళ్లిద్దరూ కాకుండా కీర్తి కూడా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది.. భారీ ట్విస్ట్ అన్నారు కాబట్టి రేవంత్ టైటిల్ రేస్ నుండి తప్పుకున్నట్టే అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.