Bigg Boss 7 Telugu – Shivaji : బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శివాజీ హౌస్ లో 105 రోజులు ఉంటాడని ఎవరూ ఊహించి ఉండరు. ఒక యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శివాజీ .. పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి పూర్తిగా నెగిటివ్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా వెళ్ళినప్పుడు .. ఒక్క వారం కంటే ఎక్కువ రోజులు ఉండలేడని అనుకున్నారు. అనూహ్యంగా ఫైనల్ కి వెళ్ళాడు. టాప్ 3లో నిలిచాడు. శివాజీ హౌస్లో ప్రశాంత్,యావర్ లకు గురువు అయ్యాడు. వాళ్ళ గెలుపునే తన గెలుపు అనుకున్నాడు.
యావర్, ప్రశాంత్ లాంటి శిష్యులు దొరకడం శివాజీకి కూడా ప్లస్ అయింది. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. మైండ్ గేమ్ ఆడుతూ ఆడియన్స్ ని ఆకర్షించిన శివాజీ విన్నర్ అవుతాడు అని అంతా అనుకున్నారు. కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత లెక్కలు మారిపోయాయి. ఆ సమయంలో ప్రశాంత్, అమర్ లు బాగా పుంజుకున్నారు. ఫలితంగా ప్రియ శిష్యుడు ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. అమర్ రన్నర్ గా నిలిచాడు. శివాజీ మూడో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు.
అయితే ఫినాలే చివరి దశకు చేరుకున్న తర్వాత ప్రశాంత్ విన్నర్ అని లీక్ బయటకు వచ్చింది. అయితే శివాజీ రన్నర్ గా నిలుస్తాడని ఆడియన్స్ అనుకున్నారు. కానీ ప్రశాంత్, యావర్ లను అంత ప్రేమగా చూసుకునే శివాజీ .. అమర్ ని చులకన చేసి మాట్లాడటం మైనస్ అయింది. పైగా 14వ వారంలో శోభా శెట్టి, ప్రియాంక పై శివాజీ చేసిన కామెంట్స్ వల్ల నెగిటివిటీ వచ్చింది.
దీంతో శివాజీ కి నిరాశే మిగిలింది. విన్నర్ కాదు .. కనీసం రన్నర్ కూడా కాలేకపోయాడు. కాని ఆయన హౌస్ లో చాలా సార్లు చెప్పిన విషయం ఏంటంటే .. నేను వచ్చింది కప్పు కోసమో .. లేక డబ్బులు కోసమో కాదు ప్రజల అభిమానం కోసం అని చెప్పేవాడు .. శివాజీ కోరుకునట్లుగానే ఒక మంచి మనిషిగా ..గురువుగా కోట్లాది ప్రజల అభిమానం సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ జర్నీ శివాజీకి ఒక మైలు రాయి అని చెప్పవచ్చు.