Bigg Boss 6 Telugu Geetu : నరసింహ సినిమాలో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి క్యారెక్టర్ ఓ సంచలనం. సూపర్ స్టార్ రజినీకాంత్ నే డామినేట్ చేసేలా రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్ ఉంటుంది. ఘాడంగా ప్రేమించిన నరసింహను తన ఇంట్లో పనిమనిషి సౌందర్య పెళ్లి చేసుకోవడంతో రగిలిపోయిన నీలాంబరి చీకటి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది. రజినీకాంత్-సౌందర్యల పెళ్లి వీడియో రీపీటెడ్ గా చూస్తూ ఏళ్ల తరబడి అందులో ఉండిపోతుంది. ఈ సీన్ ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిదంటే, ఆ నీలాంబరిని గీతూ తలపించింది. ఎలిమినేషన్ వేదనను భరించలేని గీతూ రెండు రోజుల పాటు క్వారంటైన్ గదికే పరిమితమైందట.
బిగ్ బాస్ షోకి ఎంపికైన ప్రతి కంటెస్టెంట్ రెండు వారాలు క్వారంటైన్ లో ఉండాల్సి ఉంటుంది. ఎలిమినేటైన వెంటనే గీతూ తాను క్వారంటైన్ చేసిన గదిలోకి వెళ్లిందట. తిండీ తిప్పలు మానేసి రీపీటెడ్ గా తన ఎలిమినేషన్ ఎపిసోడ్ చూస్తూ గడిపిందట. అయితే గీతూ గేమ్ ని ఎంతగానో ఇష్టపడిన కొందరు మాత్రం ఆమెకు సందేశాలు, వీడియోలు పంపారట. అవి చూశాక గీతూకి కొంత ఊరట కలిగిందట. నేను కూడా కొంత మందిని మెప్పించాను, నన్ను ఇష్టపడేవారు ఉన్నారని సంతృప్తి పడి క్వారంటైన్ గది నుండి బయటకు వచ్చిందట.
ఇక ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ లో బిగ్ బాస్ టైటిల్ గెలిచే అర్హత ఆది రెడ్డికి మాత్రమే ఉందని గీతూ వెల్లడించింది. రేవంత్ కూడా మంచి ప్లేయర్. అయినప్పటికీ అతడికి కోపం ఎక్కువ. అదే రేవంత్ కి పెద్ద మైనస్. శ్రీహన్ కి వెటకారం ఎక్కువై నెగిటివిటీ పెరిగిపోతుంది అతడు ఫైనల్ కి వెళతాడో లేదో చెప్పలేను. ఇనయా లేకపోతే హౌస్లో కంటెంట్ ఇచ్చేవాళ్లే లేరు. ఆమె వెళ్ళిపోతే బిగ్ బాస్ చూడ బుద్ధి కూడా కాదు. ఆదిరెడ్డి, రోహిత్, రేవంత్ టాప్ ఫైవ్ లో ఉంటారు. శ్రీహాన్ ఉంటాడో లేదో చెప్పలేనని గీతూ చెప్పుకొచ్చారు.
ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది. బాల ఆదిత్య శనివారం నేరుగా ఎలిమినేట్ అయ్యాడు. హౌస్లో పెద్దరికం ప్రదర్శించిన బాల ఆదిత్య అంతే హుందాగా తన ఎలిమినేషన్ అంగీకరించి నవ్వుతూ హౌస్ వీడాడు. నేడు రోహిత్ వైఫ్ మెరీనా ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. దీంతో హౌస్లో 10 మంది మిగులుతారు.