బాలయ్య బాబు సినిమాలు హిట్ అయ్యి చాలా రోజులు అవుతోంది. సరైన హిట్ కోసం బాలయ్య చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన బోయపాటి మీదే ఇప్పుడు మొత్తం భారం వేసి బాలయ్య ఎదురుచూస్తున్నాడు.
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మే 28న ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.
ఇదివరకు ‘సింహా’, లెజెండ్ వంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంతో బాలయ్య-బోయపాటి సినిమాకు బిజినెస్ బాగానే జరుగుతోంది. తాజాగా ఈసినిమా నైజాం హక్కులను, ఉత్తరాంధ్ర ఏరియాలు రెండింటిని కలిపి 19కోట్లకు దిల్ రాజు తీసుకున్నాడని టాలీవుడ్ టాక్. ఇక ఆంధ్రా ఏరియాకు 35 కోట్లు చెబుతున్నారట.. ముగ్గురు ఇవ్వడానికి రెడీగా ఉన్నారట..
కరోనా తర్వాత జనాలు ఏ సినిమా రిలీజ్ చేసినా పిచ్చిగా చేస్తున్నారు. ఏడాది ఇంట్లో ఉండి బోర్ కొట్టి థియేటర్లకు వస్తున్నారు. ఈ సో బాలయ్య సినిమాకు కూడా క్రేజ్ వచ్చినట్టు తెలుస్తోంది.
ఇప్పటిదాకా బాలయ్య సినిమాకు 50 కోట్లు దాటిన దాఖలాలు లేవు. కానీ ఈసారి మాత్రం అది బద్దలు కొట్టేలాగానే కనిపిస్తోందంటున్నారు.