https://oktelugu.com/

Balakrishna vs ABN RK : ఏబీఎన్ ఆర్కేకు ఫోన్ చేసి తిట్టిపోసిన బాలయ్య.. రాధాకృష్ణ సంచలన నిర్ణయం?

Balakrishna vs ABN RK : వైయస్ఆర్ అన్నట్టు ఆంధ్రజ్యోతి అంటే ఆ రెండు పత్రికల్లో ఒకటి. పచ్చ మీడియా క్యాంప్ లో ఒకటి. ఈనాడు సందులో నుంచి దూరంగా చూస్తూ కన్నుకొట్టే టైపు. కానీ ఆంధ్రజ్యోతి అలా కాదు ఒళ్ళంతా పసుపు పూసుకొని పోతురాజు మాదిరి కొరడా పట్టుకుని కొట్టుకునే టైపు. అలాంటి ఆంధ్రజ్యోతి ఇప్పుడు బాలకృష్ణకు కోరగాకుండా పోతోంది.. ఏకంగా ఆయన ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని తిట్టేదాకా వెళ్ళింది. కవర్ చేయడం లేదట చాలాకాలంగా ఆంధ్రజ్యోతిలో […]

Written By: , Updated On : February 23, 2023 / 12:23 PM IST
Follow us on

Balakrishna vs ABN RK : వైయస్ఆర్ అన్నట్టు ఆంధ్రజ్యోతి అంటే ఆ రెండు పత్రికల్లో ఒకటి. పచ్చ మీడియా క్యాంప్ లో ఒకటి. ఈనాడు సందులో నుంచి దూరంగా చూస్తూ కన్నుకొట్టే టైపు. కానీ ఆంధ్రజ్యోతి అలా కాదు ఒళ్ళంతా పసుపు పూసుకొని పోతురాజు మాదిరి కొరడా పట్టుకుని కొట్టుకునే టైపు. అలాంటి ఆంధ్రజ్యోతి ఇప్పుడు బాలకృష్ణకు కోరగాకుండా పోతోంది.. ఏకంగా ఆయన ఆంధ్రజ్యోతి యాజమాన్యాన్ని తిట్టేదాకా వెళ్ళింది.

కవర్ చేయడం లేదట

చాలాకాలంగా ఆంధ్రజ్యోతిలో బాలయ్య సినిమాలకు సంబంధించిన కవరేజ్ రావడం లేదు. సినిమా పేజీలో బాలయ్య ప్రస్తావన ఉండటం లేదు.   బాలయ్య వార్తలను కవర్ చేయకుండా ఓ రకంగా ఆంధ్రజ్యోతి బ్యాన్ చేసిందనే చెప్పాలి. ఓ సినిమా కవరేజ్ చేయలేదనే కోపంతో ఆంధ్రజ్యోతిపై బాలయ్య విరుచుకుపడ్డాడని, వేమూరి రాధాకృష్ణను ఫోన్లోనే తిట్టాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. దీన్ని మనసులో పెట్టుకున్న రాధాకృష్ణ ఇక నుంచి బాలయ్య సినిమాల్ని అసలు కవర్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని వినికిడి. అప్పటినుంచి బాలయ్య ఫోటో, పేరు సినిమా పేజీలో కనిపించడం లేదట..

మిమ్మల్ని ఎవడు పిలిచాడు?

ఇటీవల హిందూపురంలో ఒక కవరేజ్ కి ఏబీఎన్, ఆంధ్ర జ్యోతి ప్రతినిధులు వెళ్లారు. దీంతో బాలకృష్ణ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మిమ్మల్ని ఎవడు పిలిచాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ ఇంకాస్త పెద్దదయింది. ఏకంగా చంద్రబాబు వద్దకు పంచాయతీ వెళ్ళింది.

అయితే ఎంత తన సినిమాలను ఆంధ్రజ్యోతి మీడియా కవర్ చేయకున్నా కానీ.. బాలయ్య సినిమాలకు సంబంధించిన ప్రకటనలు మాత్రం ఆంధ్రజ్యోతిలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పత్రికకు అది ప్రధాన ఆదాయ వనరు మార్గం కాబట్టి దాన్ని వదులుకునేందుకు యాజమాన్యం ఇష్టపడటం లేదు. బాలయ్య నిర్మాతలు సైతం పెద్ద మీడియా కాబట్టి ఎందుకు అనవసరంగా పెట్టుకోవడమని ఆంధ్రజ్యోతికి యాడ్స్ ఇస్తున్నారట..

ఇలా ఆంధ్రజ్యోతి పత్రికలో బాలయ్యను బ్యాన్ చేసినప్పటికీ.. ఏబీఎన్ న్యూస్ చానెల్ లో మాత్రం కవర్ చేస్తున్నారు. మొన్న తారకరత్న బెంగళూరులోని నారాయణ ఆసుపత్రిలో ఉన్నప్పుడు బాలకృష్ణ ఆయన చెవిలో చెప్పిన మృత్యుంజయ మంత్రాన్ని…ఎంత ప్రచారం చేయాలో అంత ప్రచారం చేసింది.. అదే సమయంలో తన ఆంధ్రజ్యోతి పత్రికలో మాత్రం బ్యాన్ చేసింది. ఇదే బాలయ్యలో కోపానికి కారణమైందట.. రాధాకృష్ణకు ఫోన్ చేసి తిట్టేలా చేసిందట..  రెండిటికీ యజమాని ఒక్కడు అయినప్పుడు పేపర్ లో వేయకుండా.. న్యూస్ చానెల్ లో ఎందుకు వేస్తున్నారని బాలయ్య అగ్గిమీద గుగ్గిలం అయ్యాడట.. అంటే ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వేరువేరా? అన్నది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న అంశం. మొత్తంగా ఏబీఎన్ రాధాకృష్ణపై బాలయ్య ఫోన్ చేసి తిట్టాడన్న వార్త ఇటు రాజకీయ సర్కిల్స్ లో అటు మీడియా సర్కిల్స్ లో ఇప్పుడు తెగ ప్రచారం అవుతోంది.