Balakrishna – Ravi Teja : పండగ సీజన్ కోసం స్టార్ హీరోలు పోటీపడుతుంటారు. ఈ సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలు మంచి హిట్ లను సంపాదిస్తాయి అని నమ్ముతారు స్టార్లు. కానీ కొన్ని సార్లు బొక్కబోర్లా పడతాయి కూడా. ఇక ఇప్పటికే రవితేజ, బాలయ్య బాబులు చాలా సార్లు పండగల సందర్భంగా థియేటర్లలో పోటీ పడ్డారు. చాలా సార్లు బాలయ్యపై రవితేజ పైచేయి సాధించారు. అయితే 2023 దసరా పండగకు మాత్రం బాలయ్య హవానే కొనసాగింది.
భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు ఒక్కరోజు గ్యాప్ తో గ్యాప్ తో రిలీజ్ అవగా భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కానీ టైగర్ నాగేశ్వరరావు సినిమాకు మాత్రం ఆశించిన ఫలితాలు దక్కలేదు. అయితే ఈ ఇద్దరు స్టార్లు మరోసారి రీరిలీజ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్దమయ్యారు. మార్చి 1న కిక్ మూవీ రీరిలీజ్ కానుండడంతో మార్చి 2న సమరసింహారెడ్డి సినిమా రీరిలీజ్ కు సిద్ధమైంది. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో ఈ సినిమాల్లో రీరిలీజ్ లో ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వస్తాయో చూడాలి.
ఈ రెండు సినిమాలకు ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు మేకర్స్. కిక్, సమరసింహారెడ్డి సినిమాలకు రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ వస్తే బాలయ్య, రవితేజ నటించిన మరికొన్ని సినిమాలు రీరిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. థియేటర్ లలో ఈ రెండు సినిమాలను చూస్తామని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
బాలయ్య, రవితేజ బాక్సాఫీస్ వద్ద పోటీనే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఒక్కరోజు గ్యాప్ లో రెండు పెద్ద సినిమాలను రీరిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ ఇద్దరి స్టార్లు ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు హీరోల పారితోషికాలు సైతం దాదాపుగా సమానంగా ఉన్నాయని టాక్.