https://oktelugu.com/

వకీల్ సాబ్ పై మరో షాకింగ్ న్యూస్

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. టీవీల్లో ప్రసారమైన ఈ వేడుకను లక్షల మంది చూసి అదో రికార్డ్ గా నమోదైంది. మూడేళ్ల తర్వాత పవన్ తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. అమ్మాయిల కోసం పోరాడే పవర్ ఫుల్ లాయర్ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. టీజర్ ఇప్పటికే ట్రెండింగ్ లోకి వెళ్లింది. పింక్ మూవీకి రిమేక్ గా వస్తున్న ఈ మూవీ తొలి మూడు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు అందుకునే […]

Written By:
  • NARESH
  • , Updated On : April 5, 2021 / 11:35 AM IST
    Follow us on

    వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా సాగింది. టీవీల్లో ప్రసారమైన ఈ వేడుకను లక్షల మంది చూసి అదో రికార్డ్ గా నమోదైంది. మూడేళ్ల తర్వాత పవన్ తీస్తున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. అమ్మాయిల కోసం పోరాడే పవర్ ఫుల్ లాయర్ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. టీజర్ ఇప్పటికే ట్రెండింగ్ లోకి వెళ్లింది.

    పింక్ మూవీకి రిమేక్ గా వస్తున్న ఈ మూవీ తొలి మూడు రోజుల్లోనే రికార్డ్ స్థాయి వసూళ్లు అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నిడివి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి.

    వకీల్ సాబ్ మూవీ నిడివి 2.30 గంటలు అని తేలింది. స్టార్ హీరో సినిమా ఈ మాత్రం నిడివి ఉంటే సరిపోతుందంటున్నారు. కానీ ఇందులోనే ట్విస్ట్ ఉందంట.. మూడేళ్ల తర్వాత పవన్ కనిపించబోయే ఈ సినిమాలో మొత్తం మీద పవన్ కనిపించేది కేవలం 50 నిమిషాలేనట..

    ఇది ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ. వారిచుట్టే సినిమా ఎక్కువ నడుస్తుందట.. ‘పింక్’సినిమాలోనూ అమితాబ్ సినిమా ప్రారంభమైన చాలా సేపటికి కనిపిస్తాడు. ఇప్పుడు ‘వకీల్ సాబ్’లోనూ పవన్ కూడా చాలా సేపటికే వస్తాడట..

    అయితే పవన్ కోసం ఓ పాట, ఫైట్లు పెట్టి నిడివి పెంచారట.. మొత్తంగా సినిమా 2.30 గంటల్లో పవన్ కనిపించేది 50 నిమిషాలే అని అనడంతో ఈ విషయాన్ని పవన్ ఫ్యాన్స్ జీర్ణించుకుంటారా? లేదా అన్నది స్క్రీన్ పైనే చూడాలి.