Anil Ravipudi And Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను మొదలుపెట్టిన దర్శకుడు రాజమౌళి… ఆ తర్వాత కాలంలో పాన్ ఇండియా స్థాయి సినిమాలను చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఆయన 12 సినిమాలు చేస్తే 12 సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడమే కాకుండా 100% సక్సెస్ రేట్ ని కలిగి ఉన్న దర్శకుడిగా కూడా ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఇక తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్న రాజమౌళికి ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి… ఇక తన బాటలోనే నడుస్తున్న అనిల్ రావిపూడి సైతం వరుసగా సక్సెస్ లను సాధిస్తున్నాడు. చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాలను చేసి సంవత్సరానికి ఒక సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడి చేస్తున్న ప్రతి సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధిస్తున్నాడు…
ఇక రాజమౌళి ఒక సినిమాకి దాదాపు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే తీసుకుంటున్నాడు. కానీ అతని నుంచి సినిమా రావాలంటే దాదాపు 5 సంవత్సరాల సమయం అయితే పడుతుంది. ఇక అనిల్ రవిపూడి సైతం సినిమాకి 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ఇక ఈ లెక్కన ఆయన సంవత్సరానికి ఒక సినిమాని ఈజీగా రిలీజ్ చేస్తున్నాడు. అంటే రాజమౌళి ఒక్క సినిమా చేసేలోపు ఆయన దాదాపు మూడు నాలుగు నుంచి ఐదు సినిమాలు చేస్తున్నాడు… ఈ లెక్కన ఆయన 200 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అయితే సంపాదిస్తున్నాడు. అంటే రాజమౌళి ఒక సినిమా కోసం అన్ని సంవత్సరాల సమయాన్ని కేటాయిస్తుంటే అనిల్ రావిపూడి చాలా ఫాస్ట్ గా సినిమాలను చేస్తూ తన కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి…
ఇక ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ సినిమాతో సక్సెస్ ని సాధించాడు. కాబట్టి అతను రెమ్యూనరేషన్ భారీ రేంజ్ లో పెంచే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి…ఇక ఏది ఏమైనా అనిల్ రావిపూడి ఇక మీదట కూడా చాలా ఫాస్ట్ గా సినిమాలను చేస్తూ ఇంకా టాప్ రేంజ్ కి వెళ్తాడా లేదా అనేది చూడాలి…