Anchor Anasuya Bharadwaj : న్యూ ఇయర్ వేళ అనసూయ నగ్నసత్యాలు.. మళ్లీ ఇలా చూపించేసింది..

Anchor Anasuya makeupless : లైగర్ మూవీ వివాదం తర్వాత అనసూయతో చాలా మార్పులు వచ్చాయి. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చాలా భిన్నంగా ఉంటున్నాయి. మై లైఫ్ మై రూల్స్ అంటూ డోంట్ కేర్ యాటిట్యూడ్ మైంటైన్ చేస్తుంది. ఎవడేమంటే నాకేంటి? నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా అంటుంది. తన ట్రోలర్స్, హేటర్స్ ని మరింత రెచ్చగొట్టేలా ఆమె పోస్ట్స్ ఉంటున్నాయి. మీరు నన్ను ఎంత ట్రోల్ చేసినా నాకు ఎలాంటి ఫరక్ పడదు అని […]

Written By: NARESH, Updated On : December 30, 2022 6:30 pm
Follow us on

Anchor Anasuya makeupless : లైగర్ మూవీ వివాదం తర్వాత అనసూయతో చాలా మార్పులు వచ్చాయి. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ చాలా భిన్నంగా ఉంటున్నాయి. మై లైఫ్ మై రూల్స్ అంటూ డోంట్ కేర్ యాటిట్యూడ్ మైంటైన్ చేస్తుంది. ఎవడేమంటే నాకేంటి? నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతా అంటుంది. తన ట్రోలర్స్, హేటర్స్ ని మరింత రెచ్చగొట్టేలా ఆమె పోస్ట్స్ ఉంటున్నాయి. మీరు నన్ను ఎంత ట్రోల్ చేసినా నాకు ఎలాంటి ఫరక్ పడదు అని నిరూపించాలి అనుకుంటుంది. అదే సమయంలో శృతి మించి కామెంట్స్ పెడితే వెంటనే యాక్షన్ షురూ చేస్తుంది.

ఆ మధ్య ఓ వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన యువకుడు అనసూయతో పాటు రష్మీ, ప్రగతి, శ్రీముఖి వంటి యాంకర్స్ ని ట్రోల్ చేస్తూ అసభ్యకర పోస్ట్స్ పెడుతున్నాడు. ఆధారాలతో సహా అతన్ని పట్టించింది. అనసూయ దెబ్బకు సదరు ట్రోలర్ కటకటాల పాలయ్యాడు. పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేసి రిమాండ్ కి పంపారు. బుల్లితెర షోలు కూడా వదిలేసిన అనసూయ కొంచెం ఫ్రీ అయ్యారు. ఖాళీ సమయంలో ఇలాంటి ట్రోలర్స్ పని పడుతున్నారు.

అనసూయ ఏం చేస్తుందిలే అని లైట్ తీసుకుంటే జైలుపాలు కాక తప్పదు. ఇక రెండు రోజుల్లో కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో తన మార్క్ కామెంట్ పోస్ట్ చేసింది. ” టు డేస్ లో 2022 ముగియనుంది. మరి ప్రణాళికలు ఏమిటీ?. ఏముంది ఎప్పటి లాగే ఎలాంటి దాపరికాలు లేకుండా ట్రాన్స్పరెంట్ లైఫ్ గడుపుతాను. ఇదిగో ఈ ఫోటోల మాదిరి” అని కామెంట్ పెట్టింది. మేకప్ లెస్ ఫోటోలు షేర్ చేసిన అనసూయ… పారదర్శకమైన జీవితం గడుపుతాను అంటుంది.

నా జీవితంలో తెలియని కోణాలు ఏమీ ఉండవు. నేను అలానే ఉంటాను. వచ్చే ఏడాది కూడా నా లైఫ్ స్టైల్ పారదర్శకంగా ఉంటుంది, అంటూ పరోక్షంగా చెప్పారు. కాగా అనసూయ జబర్దస్త్ వదిలేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బుల్లితెరకు పూర్తిగా దూరమయ్యారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో పాటు స్టార్స్ చిత్రాల్లో కీలక రోల్స్ చేస్తున్నారు. పుష్ప మూవీలో దాక్షాయణిగా అనసూయ నెగిటివ్ షేడ్స్ కలిగిన డీగ్లామర్ రోల్ చేశారు. పుష్ప 2 కూడా తెరకెక్కుతుండగా అనసూయ నటిస్తున్నారు. అలాగే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ మూవీలో అనసూయ నటిస్తున్నారు.