Anasuya Bharadwaj :
యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిగా సూపర్ సక్సెస్ అని చెప్పాలి. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన అనసూయ పలు షోలకు యాంకర్ గా వ్యవహరించింది. గ్లామరస్ యాంకర్ ఇమేజ్ సొంతం చేసుకుంది. బుల్లితెరపై ఆమె చేసిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. అక్కడొచ్చిన ఫేమ్ సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం అనసూయ కెరీర్ పరంగా బిజీగా ఉంది. చేతినిండా ప్రాజెక్ట్స్ తో విపరీతంగా సంపాదిస్తుంది. కాగా రంగస్థలం సినిమా అనసూయ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి.
ఈ సినిమాలో రంగమ్మత్త గా అనసూయ నటనకు ప్రసంశలు దక్కాయి. రంగస్థలం చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. ఇక యాంకరింగ్ కి పూర్తిగా గుడ్ బై చెప్పేసిన అనసూయ పూర్తి స్థాయి నటిగా మారింది. మరోవైపు సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి కునుకు లేకుండా చేస్తుంది. అనసూయ బోల్డ్ ఫోటోలు తరచుగా ట్రోలింగ్ కు గురవుతూ ఉంటాయి.
విరామం దొరికితే భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ కి చెక్కేస్తోంది. పొట్టి బట్టల్లో ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. తాజాగా అనసూయ భర్తతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళింది. శ్రీవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయింది. గుడికెళ్లిన అనసూయ పద్దతిగా పట్టు చీరలో కనిపించింది. ఈ క్రమంలో భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు ఆమె షేర్ చేసింది.
కెరీర్ లో గొప్ప స్థాయికి ఎదగాలని, అందుకు కాలం కలిసి రావాలని అనసూయ కొన్ని ప్రత్యేక పూజలు చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అనసూయ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాలు చేస్తుంది. ఈ భామ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. పుష్ప 2 లో కీలక పాత్రలో కనిపించనుంది. ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకు వెళుతుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు క్యారెక్టర్ రోల్స్ దక్కుతున్నాయి. అనసూయ రజాకార్ నటించిన రజాకార్ విడుదలకు సిద్ధమైంది.