Ananya Nagala : తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ళ మల్లేశం మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రియదర్శి హీరోగా చేశారు. మల్లేశం ఆశించిన స్థాయిలో ఆడలేదు. చిన్నాచితకా చిత్రాలు చేస్తున్న అనన్యకు వకీల్ సాబ్ రూపంలో బంపర్ ఆఫర్ తగిలింది. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా విడుదలైన వకీల్ సాబ్ లో అంజలి, నివేదా థామస్ లతో పాటు అనన్య కథలో కీలకమైన రోల్ చేసింది.
పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ రీచ్ ఉంటుంది. దాంతో అనన్య గతంతో పోల్చితే పాపులారిటీ రాబట్టింది. అయినప్పటికీ ఆమెకు మెయిన్ లీడ్ రోల్స్ రావడం లేదు. మాస్ట్రో మూవీలో నరేష్ కూతురు రోల్ చేసింది. ఉర్వశివో రాక్షసివో మూవీలో గెస్ట్ రోల్ లో తళుక్కున మెరిసింది. సమంత పౌరాణిక చిత్రం శాకుంతలంలో సమంత చెలికత్తెగా స్క్రీన్ స్పేస్ ఉన్న పాత్రలో మెరిసింది. అయితే అయ్యింది.
కాగా సోషల్ మీడియాలో అమ్మడు హద్దులు చెరిపేస్తుంది. తరచుగా బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయం యాంకర్ ప్రస్తావనకు తెచ్చాడు. మీరు ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోస్, వీడియోలు షేర్ చేస్తారు కారణం ఏమిటని అడగ్గా… శాకుంతలం ముందు వరకు కొంచెం ట్రెడిషనల్ ఫోటోలు షేర్ చేసేదాన్ని. శాకుంతలం మూవీ సమయంలో ఓ హాట్ ఫోటో షూట్ పెట్టాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అప్పటి నుండి గ్లామరస్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెడుతున్నాడు. పరిశ్రమలో ఉండాలంటే గ్లామర్ షో తప్పదు అని అనన్య కుండబద్దలు కొట్టారు. అనన్య మాటల్లో నిజం ఉంది. అదే సమయంలో ఇంస్టాగ్రామ్ ఆదాయ మార్గం అయ్యింది. ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా బ్రాండ్ నేమ్, ఇన్కమ్ ఉంటుంది. మరి ఫాలోవర్స్ పెరగాలి అంటే స్కిన్ షో చేయాలి. ఈ కారణంతో కూడా సెలెబ్స్ మొహమాటం లేకుండా అందాలు చూపిస్తున్నారు.
View this post on Instagram