Allu Sirish Pre Wedding Celebrations: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు , అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu sirish) త్వరలోనే వైవాహిక బంధం లో అడుగుపెట్టబోతున్న సందర్భంగా, దుబాయి లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. గత ఏడాది మార్చి నెలలో తన ప్రేయసి నైనికా తో పెద్దల సమక్షం లో తన ఇంట్లోనే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు పెళ్ళికి ముందే గ్రాండ్ గా ప్రీ వెడ్డింగ్ సంబరాలు చేసుకొని వార్తల్లో నిలిచాడు. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అల్లు శిరీష్ సన్నిహితులు, స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. మార్చి నెలలో వీళ్లిద్దరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. ఇకపోతే ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అల్లు అర్జున్, స్నేహా రెడ్డి కూడా పాల్గొన్నారు.
దుబాయ్ లోని జే1 బీచ్ లో, బోటులో ప్రయాణిస్తూ ఈ జంట సంబరాలు చేసుకుంది. ఈ పార్టీ లో శిరీష్ షాంపైన్ బాటిల్ స్ప్రే చేయగా, చుట్టూ ఉన్న వాళ్లంతా చప్పట్లతో హోరెత్తించారు. ఆ సమయం లో అల్లు అర్జున్ పక్కనే నిలబడి నవ్వుతూ కనిపించాడు. ఈ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ పార్టీ లో అల్లు అర్జున్ దర్శించిన దుస్తులు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన వెర్సాస్ ప్రింటెడ్ సిల్క్ ట్విల్ షర్ట్ లో కనిపించాడు. ఇది చాలా ఖరీదైన చొక్కా. ఇంటర్నెట్ లో ఆ బ్రాండ్ కి సంబంధించిన వెబ్ సైట్ లోకి వెళ్లి చూస్తే, ఈ చొక్కా ధర దాదాపుగా 1,39,600 రూపాయిలు ఉంటుంది. దీంతో అల్లు అర్జున్ లుక్ మరోసారి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా నిల్చింది.
ఇక అల్లు శిరీష్ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఈయన చేతుల్లో ఎలాంటి సినిమాలు లేవు. ఈయన చివరిసారిగా వెండితెర పై కనిపించిన చిత్రం ‘బడ్డీ’. 2024 , ఆగస్టు నెలలో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది. ఈ సినిమాకు ముందు కూడా కెరీర్ లో ఆయనకు ఎలాంటి కమర్షియల్ హిట్స్ లేకపోవడం గమనార్హం. దీంతో హీరో గా సినిమాలు పూర్తిగా ఆపేసి అల్లు స్టూడియోస్, ఆహా మీడియా కార్యక్రమాలను చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.