Homeఎంటర్టైన్మెంట్Allu Arjun: రామ్ చరణ్ కవలపిల్లల కోసం అల్లు అర్జున్ స్వీట్ సర్ప్రైజ్..ట్వీట్ వైరల్!

Allu Arjun: రామ్ చరణ్ కవలపిల్లల కోసం అల్లు అర్జున్ స్వీట్ సర్ప్రైజ్..ట్వీట్ వైరల్!

Allu Arjun: రామ్ చరణ్(Global Star Ram Charan) , ఉపాసన(U|pasana konidela) దంపతులు కవలపిల్లలకు జన్మనిచ్చినందుకు మెగా ఫ్యామిలీ తో పాటు, అభిమానులు ఎంత ఆనందంతో ఉన్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత రెండు రోజులుగా సోషల్ మీడియా లో దీని గురించే చర్చ. సినీ సెలబ్రిటీలు , రాజకీయ నాయకులూ కూడా రామ్ చరణ్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్లు వేశారు. అందరికంటే ముందుగా రామ్ చరణ్ కి అత్యంత ఆప్త మిత్రుడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలపడం నిన్న హాట్ టాపిక్ గా మారింది. కానీ మెగా ఫ్యామిలీ హీరోలు అయినటువంటి అల్లు అర్జున్(Icon Star Allu Arjun ), పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం తో అభిమానుల్లో కాస్త అసంతృప్తి ఏర్పడింది. కచ్చితంగా వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడుకొనే ఉంటారు, కానీ అభిమానుల తృప్తి కోసం ఒక ట్వీట్ వేస్తె బాగుండేది కదా అని విశ్లేషకులు అంటున్నారు.

అయితే అల్లు అర్జున్ నిన్న సాయంత్రం ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘మరోసారి అద్భుతమైన తల్లిదండ్రులు అయ్యినందుకు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మా కుటుంబం మొత్తం తిరుగులేని సంతోషాలతో నిండిపోయింది. చిరంజీవి గారు, సురేఖ గారు ముఖం మీద ఆ సంతోషం, గర్వం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆ ఇద్దరు చిన్నారులు ఈ ప్రపంచం లోకి అడుగుపెట్టినందుకు వాళ్లకు రెట్టింపు ఆనందం, అద్భుతమైన ఉజ్వల భవిష్యత్తు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఆయన వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. సాధారణంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్, రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడూ ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఉంటారు.

ఒకే కుటుంబానికి చెందిన హీరోలు అయినప్పటికీ, ఈ రెండు ఫ్యాన్ బేస్ లు తిట్టుకుంటూ, ట్రోల్ల్స్ చేసుకుంటూనే ఉన్నాయి. కానీ ఈ ట్వీట్ పడిన తర్వాత వీళ్ళ మధ్య మంచి సఖ్యత గల వాతావరణం ఏర్పడింది. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ఉంటే చాలా బాగుంటుందని మెగా అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ట్వీట్ కోసం రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా వ్యక్తిగంగా శుభాకాంక్షలు తెలిపి ఉంటాడు. కానీ అభిమానులకు తెలిసేలా ఒక ట్వీట్ ఎస్టీ బాగుంటుందని కోరుకుంటున్నారు. పుట్టిన తర్వాత ఇద్దరు బిడ్డలను కూడా పవన్ కళ్యాణ్ చూడలేదు. గత రెండు రోజుల నుండి ఆయన అమరావతి లోనే ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీ గా ఉన్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular