https://oktelugu.com/

Alia Bhatt : స్టార్ కిడ్స్ తో వ్యాపారం చేస్తున్న అలియా భట్… ఛీప్ మెంటాలిటీ!

Alia Bhatt : చూస్తుంటే అలియా భట్ పక్కా కమర్షియల్ అనిపిస్తుంది. స్టార్ కిడ్స్ ని అడ్డం పెట్టుకొని తన వ్యాపారం వృద్ధి చేసుకోవాలనుకుంటుంది. ఆమె ట్రిక్స్ గమనిస్తున్న జనాలు చాలా ఛీప్ మెంటాలిటీ అంటున్నారు. అలియా భట్ కి ఓ ఆన్లైన్ గార్మెంట్ బిజినెస్ ఉంది. దాని పేరు Ed-a-Mamma. ఎక్స్ క్లూజివ్ గా కిడ్స్ వేర్ ఈ సంస్థ అందిస్తుంది. ఈ గార్మెంట్ బిజినెస్ ని డెవలప్ చేసుకునేందుకు అలియా భట్ చాలా తెలివిగా స్టార్ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2023 / 06:00 PM IST
    Follow us on

    Alia Bhatt : చూస్తుంటే అలియా భట్ పక్కా కమర్షియల్ అనిపిస్తుంది. స్టార్ కిడ్స్ ని అడ్డం పెట్టుకొని తన వ్యాపారం వృద్ధి చేసుకోవాలనుకుంటుంది. ఆమె ట్రిక్స్ గమనిస్తున్న జనాలు చాలా ఛీప్ మెంటాలిటీ అంటున్నారు. అలియా భట్ కి ఓ ఆన్లైన్ గార్మెంట్ బిజినెస్ ఉంది. దాని పేరు Ed-a-Mamma. ఎక్స్ క్లూజివ్ గా కిడ్స్ వేర్ ఈ సంస్థ అందిస్తుంది. ఈ గార్మెంట్ బిజినెస్ ని డెవలప్ చేసుకునేందుకు అలియా భట్ చాలా తెలివిగా స్టార్ కిడ్స్ ని ఉపయోగించుకుంటుంది. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ పిల్లలకు బట్టలు పంపింది. అది పెద్ద న్యూస్ అయ్యింది. దాంతో ఆమె గార్మెంట్ బిజినెస్ గురించి జనాల్లో బాగా చర్చ జరిగింది.

    తాజాగా మరో స్టార్ కిడ్ కి సితార ఘట్టమనేనికి అలియా భట్ బట్టలు పంపారు. మహేష్ వారసురాలు ఆ బట్టలు ధరించి ఫోటోలు దిగారు. అవి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అలియా భట్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఈద్ ఏ మమ్మ సంస్థను ప్రమోట్ చేసింది. సితార ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఓ ఐదు వేలు పది వేలు విలువ చేసే బట్టలు స్టార్ హీరోల పిల్లలకు బహుమతులుగా పంపి లక్షల విలువ చేసే ప్రచారం పొందుతుంది. తన వ్యాపారాన్ని కోట్లలో అభివృద్ధి చేసుకుంటుంది.

    అలియా భట్ తెలివి తేటలను గమనిస్తున్న పలువురు… ఆమె బహుమతుల్లో ప్రేమ కంటే వ్యాపార వృద్దే కనిపిస్తుందని ఎద్దేవా చేస్తున్నారు. ఎలాగైనా ముంబై పిల్ల అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీతో అలియా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఆమె రామ్ చరణ్ ప్రేయసి పాత్ర చేశారు. అయితే ఆమె పాత్రకు నిడివి, ప్రాధాన్యత రెండూ లేవు. కేవలం రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేశారు.

    ఎన్టీఆర్ 30లో అలియా నటించాల్సింది. రన్బీర్ కపూర్ తో ప్రేమలో పడ్డ ఆమె పెళ్ళికి ముందే తల్లి అయ్యారు. పెళ్లి ఆలోచనలో ఉన్న కారణంగా సైన్ చేసి కూడా ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో జాన్వీ కపూర్ ని తీసుకున్నారు. గత ఏడాది రన్బీర్-అలియా వివాహం జరిగింది. పెళ్లైన నాలుగైదు నెలలకే ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చారు.