https://oktelugu.com/

Akkineni Akhil : డిప్రెషన్ లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అక్కినేని అఖిల్.. పట్టించుకోని నాగార్జున

కానీ అఖిల్ మాత్రం అభిమానులు అనుభవిస్తున్న బాధకంటే వంద రెట్లు ఎక్కువ బాధని అనుభవిస్తున్నాడట. తన కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది అనుకున్న ఈ మూవీ, ఇంత దారుణంగా ఫ్లాప్ అవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : May 5, 2023 / 06:43 PM IST
    Follow us on

    Akkineni Akhil : ఎవరైనా కష్టపడి పనిచేసినప్పుడు తగిన ఫలితం రాకపోతే ఆ బాధ మామూలుగా ఉండదు, ప్రస్తుతం అక్కినేని అఖిల్ అదే పరిస్థితి లో ఉన్నాడు.తన కెరీర్ లోని ఎంతో విలువైన రెండు సంవత్సరాల కాలాన్ని ఆయన ఇటీవలే విడుదలైన ‘ఏజెంట్’  చిత్రం కోసం కేటాయించాడు. సినిమా బాగా రావడం కోసం అతను ఎంతగానో కష్టపడ్డాడు, సిక్స్ ప్యాక్ చేసాడు, రిస్కీ  స్టంట్స్ చేసాడు. యాక్టింగ్ కూడా ముందు సినిమాలతో పోలిస్తే ఎంతో బాగా తన స్కిల్స్ ని డెవలప్ చేసుకున్నాడు.

    కానీ ఫలితం తెలిసిందే.. వారం రోజులు పూర్తి అవ్వగానే ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ వ్యాప్తంగా ఒక్క థియేటర్ లో కూడా లేదు ఇప్పుడు. కేవలం నిర్మాత , దర్శకుడు మధ్య ఏర్పడిన ఈగో క్లాష్ వల్లే ఈ చిత్రం ఇలా తెరకెక్కి అక్కినేని కుటుంబ పరువు తీసేలా చేసింది. ఈ ఫలితం అక్కినేని ఫ్యాన్స్ కి ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో మనం కళ్లారా చూసాము.

    కానీ అఖిల్ మాత్రం అభిమానులు అనుభవిస్తున్న బాధకంటే వంద రెట్లు ఎక్కువ బాధని అనుభవిస్తున్నాడట. తన కెరీర్ ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది అనుకున్న ఈ మూవీ, ఇంత దారుణంగా ఫ్లాప్ అవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. గత వారం రోజుల నుండి అఖిల్ ఎవ్వరితోనూ సరిగా మాట్లాడడం లేదట, అన్నం కూడా సరిగా తినట్లేదట, ఆయనకీ ఇది మొట్టమొదటి ఫ్లాప్ అయితే కాదు, కెరీర్ లో కేవలం ఒక్క సినిమా మినహా, మిగిలినవన్నీ ఫ్లాప్స్ గానే నిలిచాయి.

    కానీ ‘ఏజెంట్’ మూవీ పట్ల మాత్రమే ఆయన ఎందుకు ఇంతలా బాధపడుతున్నాడంటే పడిన కష్టం అలాంటిది అని అర్థం అవుతుంది.నాగార్జున కూడా అఖిల్ ని డిస్టర్బ్ చెయ్యకుండా తన ప్రైవేట్ స్పేస్ తనకి ఇచ్చాడట.ఈరోజు అఖిల్ కొన్ని రోజులు మనసు కుదుట పడడం కోసం దుబాయి కి బయలుదేరాడట.ఇదంతా గమనించిన ఫ్యాన్స్ అఖిల్ ఈ డిప్రెషన్ నుండి త్వరగా కోలుకొని, కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొని బౌన్స్ బ్యాక్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.