Pawan Kalyan Talk show : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీ లో ప్రత్యక్ష్య రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో కూడా టాప్ స్టార్ గా కొనసాగుతున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.అంతే కాదు రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులు క్రేజ్ మరియు స్టార్ స్టేటస్ ని పోగొట్టుకున్నవాళ్లనే ఇది వరకు మనం చూసాము.కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇసుమంత క్రేజ్ కూడా తగ్గకపోగా, ఒకప్పుడు ఉన్నదానికంటే మూడింతలు ఎక్కువ క్రేజ్ ని చూస్తున్న హీరో కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే.
అందుకే ఆయన ఒక్క సినిమా ఒప్పుకున్నాడంటే బ్లాంక్ చెక్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోతారు నిర్మాతలు.ఇక ఆయన ఏదైనా బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవరించాడంటే, ఆ ప్రోడక్ట్ కి మార్కెట్ లో క్రేజ్ మాములుగా ఉండదు.అంతే కాదు ఆయన ఏదైనా షో కి ఇంటర్వ్యూస్ ఇచ్చాడంటే కనీవినీ ఎరుగని రేంజ్ టీఆర్ఫీ రేటింగ్స్ వస్తాయి.
రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో కి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి అందరికీ తెలిసిందే.ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజించి అప్లోడ్ చేసారు.రెండు భాగాలకు కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.ఇప్పటి వరకు ఈ టాక్ షో కి ఎంతో మంది స్టార్ హీరోలు వచ్చారు కానీ, ఏ ఎపిసోడ్ కి కూడా ఇలాంటి వ్యూస్ మరియు రేటింగ్స్ రాలేదు.పవన్ కళ్యాణ్ క్రేజ్ ని చూసి మెంటలెక్కిపోయిన ఆహా మీడియా టీం, ఆయనతో ఒక షో హోస్ట్ చేయిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట.హిందీ లో అమీర్ ఖాన్ హోస్ట్ గా చేసిన ‘సత్యమేవ జయతే’ ప్రోగ్రాం సెన్సేషనల్ హిట్ అయ్యింది.జనాల సమస్యలను తెలుసుకొని, పరిష్కరించే వేదికగా ఆ షో అశేష ప్రజాధారణ అందుకుంది.
తెలుగులో ఇదే షో ని పవన్ కళ్యాణ్ చెయ్యాలనే ఆలోచన ఎప్పటి నుండో మేకర్స్ కి ఉంది.కానీ ఆయనకీ ఉన్న బిజీ వల్ల అది కార్యరూపం దాల్చలేదు.కానీ ఆహా మీడియా అధినేత అల్లు అరవింద్ ఒక అడుగు ముందుకు వేసి పవన్ కళ్యాణ్ తో ఈ షో ఆహా లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.ఇటీవలే పవన్ కళ్యాణ్ ని కలిసి ఈ ఐడియా చెప్పగా, ఆయనకీ ఎంతగానో నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.మరి షో కి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.