Anil Ravipudi Rajamouli : రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడినే!

Anil Ravipudi Rajamouli : టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకులు ఎవరంటే ఠక్కున చెప్పే సమాధానం ‘రాజమౌళి’. రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లో ప్యాన్ ఇండియా దర్శకుడైపోయాడు. మరి రాజమౌళిని మినహాయించి ఇంకా ఎవరున్నారంటే మొన్నటి వరకూ ‘కొరటాల శివ’ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ‘ఆచార్య’తో అట్టర్ ఫ్లాప్ ఇచ్చి ఈ జాబితాలోంచి తప్పుకున్నారు. ఇంకొంతమంది చిన్నా చితకా దర్శకులున్నా ఇంత పెద్ద సక్సెస్ లు కొట్టినవారు మాత్రం తక్కువమందే.. మరి ఇంకెవరు అంటే […]

Written By: NARESH, Updated On : May 28, 2022 4:54 pm
Follow us on

Anil Ravipudi Rajamouli : టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకులు ఎవరంటే ఠక్కున చెప్పే సమాధానం ‘రాజమౌళి’. రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ లో ప్యాన్ ఇండియా దర్శకుడైపోయాడు. మరి రాజమౌళిని మినహాయించి ఇంకా ఎవరున్నారంటే మొన్నటి వరకూ ‘కొరటాల శివ’ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన ‘ఆచార్య’తో అట్టర్ ఫ్లాప్ ఇచ్చి ఈ జాబితాలోంచి తప్పుకున్నారు. ఇంకొంతమంది చిన్నా చితకా దర్శకులున్నా ఇంత పెద్ద సక్సెస్ లు కొట్టినవారు మాత్రం తక్కువమందే.. మరి ఇంకెవరు అంటే ఆ జాబితాలోకి ‘ఎఫ్3’తో వచ్చేశాడు మన ‘అనిల్ రావిపూడి’. అవును ఓటమి ఎరుగని దర్శకుల జాబితాలో రాజమౌళి తర్వాత మన అనిల్ రావిపూడి నిలవడం విశేషంగా చెప్పొచ్చు.

రాజమౌళిలాగానే అనిల్ రావిపూడిది కూడా హిట్ ట్రాక్ కావడం విశేషం. ‘పటాస్’తో కళ్యాణ్ రామ్ హీరోగా తీసిన తొలిచిత్రం నుంచి నేటి ‘ఎఫ్3’ వరకూ అనిల్ అన్ని సినిమాలు సక్సెస్ సాధించడం విశేషం. సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3.. ఇలా వరుసగా సక్సెస్ సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో ఆ ట్రాక్ రికార్డును కాపాడుకోవడంలో అనిల్ రావిపూడి విజయం సాధించాడు.

నాడు ‘జంధ్యాల’.. ఈవీవీ సత్యనారాయణ లాగా కేవలం కామెడీనే నేటి నవతరం దర్శకుల్లో అనిల్ రావిపూడి బలం. వారిని మరిపించేలా నేటి ఆయన సినిమాలు ఉండడం విశేషం. కామెడీతోనే వరుసగా సినిమాలు హిట్ కొట్టేస్తున్నాడు.

అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ తెరపై అద్భుతంగా పేలుతోంది. ఎఫ్2లో అయితే విక్టరీ వెంకటేశ్ తో కలిసి చేసిన నవ్వుల జల్లును ఎవరూ మరిచిపోలేరు. ఇప్పుడు ఎఫ్3తో అంతకుమించిన దట్టించిన కామెడీతో మరోసారి తన స్టామినాను అనిల్ రావిపూడి నిరూపించుకున్నాడు.

ఎఫ్3లో కథ ఏం కొత్తగా లేకున్నా.. లాజిక్ లేకపోయినా కూడా కేవలం కామెడీతోనే మ్యాజిక్ చేసి రెండున్నర గంటల పాటు ఫుల్ ఫ్యామిలీని నవ్వించగల సత్తా ఉన్నా దర్శకుడిగా మరోసారి అనిల్ రావిపూడి నిరూపించుకున్నాడు.

కొరటాల వంటి మంచి దర్శకుడికే హిట్ ట్రాక్ ను కాపాడుకోవడం సాధ్యం కాలేదు. కానీ రాజమౌళి తర్వాత ఆ ఘనతను మన అనిల్ రావిపూడి సొంతం చేసుకోవడం విశేషం.

ఈ కాలంలో ఒక సినిమాను హిట్ కొట్టించడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ మన అనిల్ దాన్ని చేసి చూపించాడు. అందరిలో డిఫెరెంట్ జోనర్ లు కాకుండా కత్తిమీద సాము లాంటి కామెడీని నమ్ముకొని రెండున్నర గంటలు అలరించడం అంటే మాటలు కాదు.. ఇప్పుడు ఆ అసాధ్యాన్ని చేసి చూపించాడు అనిల్. తన హిట్ ట్రాక్ రికార్డును కాపాడుకున్నాడు.