https://oktelugu.com/

Star Heroine: భర్త వదిలేశాక, పాత బంధంలోకి స్టార్ హీరోయిన్ !

Star Heroine: ఆ హీరోయిన్ గారిది ఆ స్టార్ డైరక్టర్ గారిది చాలా పాత అనుబంధం. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఇద్దరు చక్కని స్నేహంతో ఎనలేని ప్రేమను కురిపించేసుకుంటూ కొంతకాలం పాటు సంతోషంగా బయట లోకాన్ని మర్చిపోయి.. ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఒకటిగా బతికారు. కానీ, మధ్యలో ఆమెకు మరో హీరోతో పెళ్లి అయింది. దాంతో ఇద్దరూ బ్రేకప్ పుచ్చుకున్నారు. మొత్తానికి చాలా కాలం పాటు సాగిన వీరి జర్నీలో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయట. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 16, 2021 / 04:06 PM IST
    Follow us on

    Star Heroine: ఆ హీరోయిన్ గారిది ఆ స్టార్ డైరక్టర్ గారిది చాలా పాత అనుబంధం. మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఇద్దరు చక్కని స్నేహంతో ఎనలేని ప్రేమను కురిపించేసుకుంటూ కొంతకాలం పాటు సంతోషంగా బయట లోకాన్ని మర్చిపోయి.. ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఒకటిగా బతికారు. కానీ, మధ్యలో ఆమెకు మరో హీరోతో పెళ్లి అయింది. దాంతో ఇద్దరూ బ్రేకప్ పుచ్చుకున్నారు.

    Star Heroine

    మొత్తానికి చాలా కాలం పాటు సాగిన వీరి జర్నీలో ఎన్నో మధురానుభూతులు ఉన్నాయట. అయితే, ఆ తర్వాత ఆ డైరెక్టర్ గారి లిస్ట్ లో మరో క్రేజీ హీరోయిన్ చేరిపోయింది. ఆమెతోనే వరుస సినిమాలు ప్లాన్ చేస్తూ మొత్తానికి తన బంధాన్ని ఆ టాల్ బ్యూటీతో కొనసాగిస్తున్నాడు. ఐతే, ముందు హీరోయిన్ గారు ఈ మధ్య తన భర్తకు గుడ్ బాయ్ చెప్పింది.

    ఆమె చెప్పిందా ? లేక అతనే చెప్పాడా ? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, ఆ హీరోయిన్ మాత్రం తెగిపోయిన తన బంధాలను మళ్ళీ బలపర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో సదరు డైరెక్టర్ గారితో మీటింగ్ ల్లో కూర్చుంటుంది. ఆ డైరెక్టర్ ప్రస్తుతం ఒక స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలో తనను హీరోయిన్ గా పెట్టుకోవాలని ఆమె బలంగా కోరుకుంటుంది.

    కాకపోతే, ఆ హీరోగారు ఒప్పుకోవాలి. దానికంటే ముందు సదరు డైరెక్టర్ గారి ఇగో శాంతించాలి, ఆ హీరోయిన్ పెళ్లి చేసుకునే సమయంలో ఆ డైరెక్టర్ ను నిర్ధాక్ష్యంగా కట్ చేసేసింది. పైగా ఓ ఫంక్షన్ లో ఆ డైరెక్టర్ కనిపిస్తే.. కనీసం అతని మొహం కూడా చూడలేదు. ఆ అవమానాలను ఆ దర్శకుడు ఇంకా మర్చిపోలేదు. కాబట్టి, మళ్ళీ ప్యాచప్ కోసం హీరోయిన్ గారి సైడ్ నుంచి కాస్త గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి.

    Also Read: ఆ హీరో ఫెయిల్యూర్ కి కారణం అతనే !

    డైరెక్టర్ కలుస్తున్నాడు గానీ, ఆమెకు మాట ఇవ్వడం లేదు. అయితే, ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల టాక్ ప్రకారం.. డైరక్టర్ వైపు నుంచి పెద్దగా అభ్యంతరం లేదట. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తమ బంధం కలిసిందని.. ఆ పాత బంధంలోని తీపి గుర్తులను ఒక్కసారి మళ్లీ నెమరువేసుకోవాలనే మూడ్ లో ఉన్నాడట సదరు డైరెక్టర్.

    కానీ ఆమెకు హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలి అంటే.. ఆ స్టార్ హీరో ఒప్పుకోవాలి. హీరోలను ఒప్పించడంలో ఈ డైరెక్టర్ గారు సిద్ధహస్తుడు. కాబట్టి ఒప్పిస్తాడు.

    Also Read: Ticket prices issue: టికెట్‌ రేట్ల‌పై విచార‌ణ వాయిదా.. పుష్ప మూవీకి బిగ్ రిలీఫ్‌..!

    Tags