Dacoit Movie Advance Bookings: అడివి శేష్(Adivi Sesh) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్'(Dacoit Movie) ఈ నెల 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా మొదలయ్యాయి. అయితే ఈ బుకింగ్స్ కి ఎవ్వరూ ఊహించనంత క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఈ బుకింగ్స్ ని చూసిన తర్వాత, అడివి శేష్ వరుస సూపర్ హిట్ సినిమాలతో ఆడియన్స్ లో ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడో అర్థం అవుతుందంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లోని నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. నార్త్ అమెరికా లో ఇప్పట్టి వరకు ఈ చిత్రానికి 1 లక్షా 60 వేల డాలర్లు నమోదు అయ్యాయి.
ట్రెండ్ చూస్తుంటే ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి 4 లక్షల డాలర్ల నుండి హాఫ్ మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒక మీడియం రేంజ్ హీరో కి , నాలుగేళ్ల నుండి ఎలాంటి సినిమా చేయకపోయినా, అతని నుండి ఒక సినిమా వస్తుందంటే , ఒక సెక్షన్ ఆడియన్స్ ఇలా ఎగబడి చూస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవచ్చు, అడివి శేష్ బ్రాండ్ ఎలాంటిదో. ఇక తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అడ్వాన్స్ బూకిన్స్ చాలా ఫైర్ మీద ఉన్నాయి. బుక్ మై షో యాప్ లో గంటకు 2 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. రేపు ఈ సంఖ్య మరో లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే, ఈ చిత్రానికి ఫైనల్ ప్రీ సేల్స్ కేవలం హైదరాబాద్ నుండే 2 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఓవరాల్ ఇండియా వైడ్ గా ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 5 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. ఇక పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా వసూళ్లు ఎక్కడ మొదలై , ఎక్కడ ఆగుతుందో ఎవ్వరూ కనిపెట్టలేరు. ఆ రేంజ్ లో ఉంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించగా, ఈ ఈవెంట్ కి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. అదే విధంగా నిర్మాత నాగవంశీ సుప్రియ ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి.