Actress Nandini CM passed Away: ప్రముఖ కన్నడ, తమిళ సీరియల్ హీరోయిన్ నందిని(Actress Nandini CM) (26 ఏళ్ళు) నిన్న ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. నందిని తన పీజీ రూమ్ లో డిసెంబర్ 29 తెల్లవారు జామున ఫ్యాన్ కి ఉరి వేసుకొని చనిపోయింది అట. ఈ విషయాన్నీ ఆమె స్నేహితులు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు కనిపెట్టారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుకోకపోవడం తో అనుమానం వచ్చి ఆమె పీజీ రూమ్ కి రాగా, ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించడంతో స్నేహితులు శోకసంద్రం లో మునిగిపోయారట. ఈ విషయాన్నీ బెంగళూరు సిటీ లోని కెంగేరి ప్రాంతానికి చెందిన పోలీసులు ధ్రువీకరించారు. పోలీసులు అందించిన మరికొంత సమాచారం బట్టీ చూస్తే డిసెంబర్ 28 న నందిని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి, రాత్రి 11 గంటల 23 నిమిషాలకు తన పీజీ కి తిరిగి వచ్చిందట.
ఆ తర్వాత రాత్రి నుండి నందిని ఫోన్ కాల్స్ కి సమాధానం ఇవ్వట్లేదట. ఆమె స్నేహితురాలికి అనుమానం వచ్చి, పీజీ స్టాఫ్ కి సమాచారం తెలియజేసారు. పీజీ స్టాఫ్ తో పాటు, అక్కడ ఉండే స్నేహితులు కూడా నందిని రూమ్ కి వెళ్లి చూడగా, ఆమె విగతజీవిగా పడుండడం చూస్తే దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆమె అలా అఘాయిత్యం చేసుకోవడానికి గల ముఖ్య కారణం కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడం వల్లే. నందిని కి సినీ రంగం లో కొనసాగాలని ఆసక్తి. కానీ 2023 వ సంవత్సరం లో ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి ఆమె తండ్రి చనిపోవడం తో, ఆ జాబ్ ఆఫర్ నందిని కి వచ్చింది. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం తీసుకొని, చక్కగా పెళ్లి చేసుకొని స్థిరపడమని ఒత్తిడి చేశారు. కానీ నందిని కి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, నటన లోనే కొనసాగాలని ఉంది. ఇలా కుటుంబ సభ్యులు తీవ్రమైన ఒత్తిడి పెట్టడం తో, అది భరించలేక ఆమె ఇలా చేసుకొని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
నందిని 2019 వ సంవత్సరం నుండి కన్నడ సీరియల్స్ లో నటిస్తూ వస్తోంది. అక్కడ మంచి పాపులారిటీ రావడం తో తమిళం లో కూడా ఆమెకు సీరియల్స్ లో అవకాశాలు క్యూ కట్టాయి. తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘గౌరీ’ సీరియల్ లో దుర్గ, కనకగా ద్విపాత్రాభినయం చేసి అశేష ప్రేక్షాభిమానం ని సంపాదించుకుంది. అలా కెరీర్ లో దూసుకుపోతున్న ఈమెకు తెలుగు లో కూడా ఈమధ్యనే మంచి అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. ఇంతలోపే ఇంత చిన్న వయస్సు లో ఆమె ఇలా చేసుకోవడం దురదృష్టకరం అనే చెప్పాలి.