Mahesh – Namratha : మహేష్ ఫారిన్ టూర్లో ఉన్నారు. మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం ఆయన సతీసమేతంగా విదేశాలకు వెళ్లారు. ఫిబ్రవరి 10 మహేష్-నమ్రతల పెళ్లి రోజు కాగా 18 ఏళ్ళు వైవాహిక ప్రయాణం పూర్తి చేశారు. మహేష్ టూర్లో ఉండగా దర్శకుడు త్రివిక్రమ్ నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి మూడో వారం నుండి లాంగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. దీని కోసం హైదరాబాద్ లో భారీ విలాసవంతమైన ఇంటి సెట్ వేస్తున్నారట. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ నేతృత్వంలో ఈ సెట్ రూపొందుతుందట.
ఎస్ఎస్ఎంబి 28కి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడే జరగనుందట. ఈ ఇంటి సెట్ కోసం రూ. 10 కోట్లు ఖర్చు చేస్తున్నారట. మరి ఓ సెట్ కి పది కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. ఈ న్యూస్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. ఈ క్రమంలో ఎస్ఎస్ఎంబి 28 బడ్జెట్ గురించి అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. మహేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నారట. దాదాపు రూ. 200 కోట్లు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ తో మేజర్ గా మహేష్, త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ కి పోతుందట. అలాగే పూజా హెగ్డే రూ. 4-5 కోట్లు తీసుకుంటున్నారట. కాగా దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతుంది. ఇది వీరికి హ్యాట్రిక్ చిత్రం. అతడు, ఖలేజా చిత్రాల అనంతరం ఎస్ఎస్ఎంబి 28 కోసం చేతులు కలిపారు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడు, ఖలేజా చిత్రాలకు మహేష్ కెరీర్లో ప్రత్యేక స్థానం ఉంది.
ఎస్ఎస్ఎంబి 28ని త్రివిక్రమ్ తన మార్క్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల మరొక హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తానున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నారు. 2023 సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆలస్యమైంది. దీంతో ఆగస్టులో విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నారట. ఈ చిత్రంపై మహేష్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.
మరోవైపు దర్శకుడు రాజమౌళి మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు షురూ చేశారు. మహేష్ 29వ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. రాజమౌళి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో మహేష్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ యూనివర్సల్ అప్పీల్ తో కూడిన యాక్షన్ అడ్వెంచర్ జోనర్లో కథను సిద్ధం చేశారు. ఈ ఏడాదే మహేష్-రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.