Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయి. మరో రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. అలాగే వినాయక్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అసలు మెగాస్టార్ గత ఇరవై సంవత్సరాలలో ఎన్నడూ ఈ స్పీడ్ లో సినిమాలు చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా ? అసలు మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ కి కారణం ఏమిటి ?
కారణం ఒక్కటే కనిపిస్తుంది. చిరు ఒక్కో సినిమాకు నలభై కోట్లు తీసుకుంటున్నారు. అంటే.. ఐదు సినిమాలకు 200 కోట్లు. ఏడాదికి ఐదు సినిమాలు చేయాలని చిరు నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన సంవత్సరానికి 200 కోట్లు సంపాదన. అందుకే చిరు సినిమాల వేగం పెంచారు. 5 సినిమాలు ఒకేసారి సెట్స్ పై ఉన్నా.. కొత్త సినిమాల గురించి ఆలోచిస్తున్నారు.
Also Read: చిరంజీవి సీఎం కల.. అసలు ఎలా పుట్టింది?
అసలు నాలుగు సినిమాలను ఒకేసారి మ్యానేజ్ చేస్తూ.. అన్నీ సినిమాలకు షూటింగ్ డేట్స్ ను కేటాయించడం అంటే నిజంగా గొప్ప విశేషమే. ఈ జనరేషన్ లో ఇది ఒక విధంగా రికార్డే అనుకోవచ్చు. ‘గాడ్ ఫాదర్, భోళా శంకర్’ మరియు బాబీతో చేసే సినిమా’ చిత్రాల షూటింగ్ లో ప్రస్తుతం చిరు పాల్గొంటున్నారు. ఈ మూడు సినిమాలు గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఇక వచ్చే నెల నుంచి యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల సినిమా షూటింగ్ హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది. ఈ సినిమా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే కీలక షెడ్యూల్ షూట్ ను జరుపుకోబోతుంది. ఇక ఆచార్య సినిమా ప్రమోషన్స్ కోసం కూడా చిరు డేట్లు కేటాయించాడు. మొత్తమ్మీద ఒకే సమయంలో ఐదు సినిమాలకూ చిరు ఇలా డేట్లు కేటాయించడం అంటే ఒక్క చిరుకే సాధ్యం అయింది. అయినా ఏడాది 200 కోట్లు కదా. అందుకే చిరు బాగానే కష్ట పడుతున్నాడు.
Also Read: చిరంజీవిని తీసిపారేశాడే? సినీ ఇండస్ట్రీని అవమానించేలా పేర్నీ నాని తీరు..