
Seetimaarr Trailer: ఈ మధ్య కథా బలమున్న చిత్రాలతో గోపీచంద్(Gopi chandh) మూవీలు తీస్తున్నాడు. మంచి దర్శకులతో కొత్త సబ్జెక్ట్ లు ట్రై చేస్తున్నాడు. వాటి ఫలితం ఎలా ఉన్నా కానీ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. తాజాగా మరో చిత్రంతో మన ముందుకు వచ్చాడు అదే ‘సిటీమార్’.
గోపీచంద్ హీరోగా సంపత్ నంది(Sampath nandi) దర్శకత్వంలో రూపొందిన ‘సిటీమార్’ చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. తమన్నా హీరోయిన్. ఈ వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న సినిమాను విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే యువ హీరో రామ్ పోతినేని తాజాగా ‘సిటీ మార్ ’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ ఉంది.
కబడ్డీ నేపథ్యంలో సాగే కథ ఇదీ అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్ లుగా కనిపించనున్నారు. సూర్యవంశీ, భూమిక కీలక పాత్రలు పోషించారు. చిట్టూరి శ్రీనివాస నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు.
సిటీ మార్ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. కబడ్డీ ఆడడానికి యువ మహిళా క్రీడాకారిణిలు పడే ఇబ్బందులు.. వీరి ఆట ముందుకు సాగకుండా విలన్లు అడ్డుకునే ఘటనలు.. తల్లిదండ్రుల నిరాకరణతో చివరకు వీళ్లు జాతీయ చాంపియన్లుగా ఎలా ఎదిగారన్నది ఆసక్తికరంగా ట్రైలర్ చూపించారు.
ట్రైలర్ ను కింద చూడొచ్చు.