Vishwam Movie Collections : ఈ ఏడాది సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ గా నిల్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో గోపీచంద్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన ‘విశ్వం’ చిత్రం ఒకటి. చాలా కాలం నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ ఇద్దరికీ ‘విశ్వం’ చిత్రం ఒక సైలెంట్ హిట్ గా నిల్చింది. తన మార్క్ కామెడీ ని జోడించి, ఆసక్తికరమైన కథాంశంతో ఈ దసరా కానుకగా విడుదలైన ‘విశ్వం’ చిత్రం, ఎన్టీఆర్ ‘దేవర’ మేనియా ని తట్టుకొని నిలబడి సూపర్ హిట్ అయ్యింది. హైప్ లేకపోవడం వల్ల మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. కానీ ఆ తర్వాత రెండవ రోజు నుండి ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియన్స్ రావడం మొదలు పెట్టారు.
అలా మొదలైన ‘విశ్వం’ బాక్స్ ఆఫీస్ ప్రయాణంలో 17 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 17 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత షేర్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా ఈ స్టోరీ లో చూద్దాం. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి 17 రోజులకు గాను 4 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ పండితులు చెప్తున్నారు. అలాగే నైజాం ప్రాంతం లో కూడా ఈ సినిమాకి డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి. ఆ ప్రాంతం లో బయ్యర్స్ కి ఈ సినిమా లాభాలను కూడా తెచ్చిపెట్టింది. 17 రోజులకు నైజాం ప్రాంతం లో 3 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు.
అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ఓవర్సీస్, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాలకు కలిపి ఈ సినిమా కనీసం కోటి రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోవడం గమనార్హం. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ ప్రాంతాలు మొత్తం కలిపి 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. బయట రాష్ట్రాల్లో ఈ సినిమా డీసెంట్ వసూళ్లు రాబట్టి ఉన్నా ఈపాటికి బ్రేక్ ఈవెన్ అయిపోయేది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 10 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 17 రోజులకు 8 కోట్ల 79 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, దీపావళి కి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఓటీటీ విడుదల ఈ నెలలోనే కావాలి కానీ, థియేట్రికల్ రన్ బాగా ఉండడంతో వాయిదా వేశారు. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ తో నష్టాల్లో ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి ఈ చిత్రం కాస్త ఉపశమనం కలిగించింది . గతంలో ఇదే సంస్థలో గోపీచంద్ ‘రామబాణం’ అనే చిత్రం చేసాడు. కమర్షియల్ గా ఈ సంస్థకి ఈ చిత్రం భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఆ నష్టాలను విశ్వం చిత్రం కొంతమేరకు పూడ్చింది.