Viswam Collections: గోపీచంద్ ‘విశ్వం’ మొదటివారం వరల్డ్ వైడ్ వసూళ్లు..వర్కింగ్ డేస్ లో కూడా తగ్గని జోరు!

మొదటి రోజు ఈ చిత్రానికి కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ప్రీ రిలీజ్ కంటెంట్ జనాలకు అసలు ఏమాత్రం ఎక్కలేదని. కానీ అనూహ్యంగా ఈ చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

Written By: Vicky, Updated On : October 18, 2024 11:39 am

Viswam Collections

Follow us on

Viswam Collections: మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు మ్యాచో స్టార్ గోపీచంద్. ఒకప్పుడు ఈయన సినిమా విడుదలకి స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ ఉండేది. ఓపెనింగ్స్ దద్దరిల్లిపోయేవి. కానీ ఆ స్టామినా ని ఆయన కొనసాగించడం లో విఫలం అయ్యాడు. ‘లక్ష్యం’ చిత్రం వరకు ఈయన కెరీర్ చాలా సాఫీగా సాగిపోతూ వచ్చింది. కానీ ఆ సినిమా తర్వాత వరుసగా ఫ్లాప్స్ ఎదురయ్యాయి. మధ్యలో రెండు యావరేజ్ సినిమాలు తగిలాయి కానీ, అవి గోపీచంద్ మార్కెట్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఫ్లాప్స్ ప్రభావం కారణంగా ఆయన మార్కెట్ దారుణంగా దెబ్బ తినింది. రీసెంట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కుర్ర హీరోలు కూడా గోపీచంద్ ని దాటేసారు. అలాంటి సమయం లో ఆయన వరుస ఫ్లాప్స్ లో ఉన్నటువంటి శ్రీను వైట్ల తో ‘విశ్వం’ చిత్రం ప్రకటించినప్పుడు ఎవ్వరూ పట్టించుకోలేదు.

మొదటి రోజు ఈ చిత్రానికి కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ప్రీ రిలీజ్ కంటెంట్ జనాలకు అసలు ఏమాత్రం ఎక్కలేదని. కానీ అనూహ్యంగా ఈ చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రొటీన్ కథ అయ్యినప్పటికీ కూడా శ్రీను వైట్ల మార్క్ కామెడీ పేలింది. ఫలితంగా మొదటి రోజు సాయంత్రం షోస్ నుండే అన్ని ప్రాంతాల్లో ఊపు అందుకుంది. దసరా రోజు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంది. దసరా తర్వాత కూడా వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, మొత్తం మీద వారం రోజులకు ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి వారం రోజులకు గానూ రెండు కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వసూళ్లు వచ్చాయి. అలాగే ఆంధ్ర ప్రదేశ్ సీడెడ్ ప్రాంతాలకు గానూ వారం రోజులకు 3 కోట్ల 13 లక్షల రూపాయిల షేర్ వచ్చింది.

అలా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల 39 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ ప్రాంతాలకు కలిపి 61 లక్షల రూపాయిలు వచ్చింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా కొత్త సినిమాలు విడుదల లేకపోవడంతో మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని, బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరగా వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు. వాస్తవానికి బ్రేక్ ఈవెన్ ఇప్పటికే అయిపోయినట్టే. కేవలం 5 కోట్ల రూపాయలకు మాత్రమే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ కొన్ని ప్రముఖ చానెల్స్ 10 కోట్ల రూపాయలకు పైగా బిజినెస్ జరిగిందని అంటున్నారు. వాళ్ళ లెక్కల్లో కూడా బ్రేక్ ఈవెన్ మార్కు ని దాటాలంటే ఈ వీకండ్ కచ్చితంగా బలమైన వసూళ్లను రాబట్టాలి.