యాక్షన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపిచంద్. దర్శకుడు తేజతో గోపిచంద్ తర్వాత మూవీ ఉండనుందని సమాచారం. గోపిచంద్ కోసం దర్శకుడు తేజ ఓ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ నచ్చడంతో గోపిచంద్ తేజకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లలో జయం, నిజం మూవీ వచ్చాయి. ఈ మూవీలో విలన్ గా నటించిన గోపిచంద్ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు.
అయితే గతకొంతకాలంగా గోపిచంద్ సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇటీవల గోపిచంద్ నటించిన ‘చాణక్య’ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో కొంత నిరాశకు గురయ్యాడు. ఆ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ మూవీలో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా ‘సీటీమార్’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో గోపిచంద్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నాడు. గోపిచంద్ సరసన తమన్నా నటిస్తుంది. తమన్నా తెలంగాణ జట్టు కోచ్ గా నటిస్తుంది. ఆంధ్రా, తెలంగాణ జట్ల మధ్య జట్ల మధ్య జరిగే పోటీని ఆసక్తికరంగా సంపత్ నంది తెరకెక్కించాడు. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.
‘సీటీమార్’ మూవీ షూటింగ్ పూర్తి కాగానే తేజ దర్శకత్వంలో గోపిచంద్ నటించనున్నట్లు సమాచారం. తనకు అచ్చివచ్చిన యాక్షన్ కథలతోనే బాక్సాఫీస్ హిట్టు అందుకోవాలని గోపిచంద్ చూస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు సంపత్ నందితో స్పోర్ట్స్ డ్రామాగా ‘సీటీమార్’ మూవీని లైన్లో పెట్టిన గోపిచంద్ ఆ తర్వాత మూవీలోనూ యాక్షన్ కథనే నమ్ముకున్నాడు. తేజ గోపిచంద్ కోసం ఓ పవర్ ఫుల్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ‘జయం’, ‘నిజం’ మూవీలో గోపిచంద్ లోని విలనిజాన్ని పరిచయం చేసిన తేజ తన తదుపరి మూవీలో హీరోయిజాన్ని ప్రేక్షకులకు చూపించనున్నాడు. వరుస మూవీలను లైన్లో పెడుతూ గోపిచంద్ బీజీగా మారుతున్నాడు. సరైన హిట్టుకోసం వెయిట్ చేస్తున్న గోపిచంద్ కు తేజ హిట్టు అందిస్తాడో? లేదో చూడాలి.