Gopichand Malineni and NTR : సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళు చేసిన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఒక సినిమాకి మాస్ ఎలివేషన్స్ ఇవ్వడంలో కూడా వాళ్ళు చాలా వరకు సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే గోపీచంద్ మలినేని లాంటి దర్శకుడు సైతం ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో మంచి విజయాలను అందుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతనికి చాలా మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. రీసెంట్గా ఆయన చేసిన ‘జాట్’ (Jaat) సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు.
Also Read : గోపీచంద్ మలినేని మరోసారి ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?
సన్నీ డియోల్ (Sunny Deol) కి చాలా రోజుల తర్వాత సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి పెట్టాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈయన చేయబోతున్న కమర్షియల్ సినిమాలు ప్రేక్షకులందరికి ఒక హై ఎమోషన్ ను ఇచ్చే విధంగా ఉంటాయి. అందువల్లే ఆయన సినిమాలు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతూ ఉంటాయి. ఇక క్రాక్ (Crack) సినిమా నుంచి రూట్ మార్చిన ఆయన డిఫరెంట్ అటెంప్ట్ లతో ప్రేక్షకులను మెప్పించే విధంగా ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా సాగుతూనే భారీ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా అందులో భాగమై ముందుకు సాగుతూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఆయన ఎన్టీఆర్ (NTR) తో సినిమా చేయాల్సిన ఆపర్చునిటీ అయితే వచ్చింది. కానీ ఆయన చెప్పిన సబ్జెక్ట్ చాలా హెవీగా ఉండటం వల్ల ఎన్టీఆర్ తన నుంచి ఒక ఎంటర్ టైన్ మెంట్ సబ్జెక్ట్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పారట. దాంతో గోపీచంద్ మలినేని కి ఏం చెప్పాలో అర్థం కాక కొన్ని కథలు రెడీ చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ ని అప్రోచ్ అవుదామని అనుకొని తన సినిమాలు తను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారట.
ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. కాబట్టి ఇప్పుడు కనక ఆయనతో సినిమా చేయాలి అంటే ఒక కొత్త జానర్లో సినిమా కథని రాసుకొని దానికి తగ్గట్టుగా అతనిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరమైతే ఉందని రీసెంట్ గా గోపీచంద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక గోపీచంద్ కి ఎన్టీఆర్ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి.
Also Read : ఎన్టీఆర్ సన్నబడటానికి అసలు కారణం ఏంటో చెప్పిన ప్రశాంత్ నీల్