Gopichand : ఆహా మీడియా లో ప్రసారమయ్యే ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ షో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే..మొదటి సీజన్ బంపర్ హిట్ అనుకుంటే రెండవ సీజన్ మొదటి సీజన్ కంటే పెద్ద హిట్ గా నిలిచింది.,రెండవ సీజన్ ఈ రేంజ్ హిట్ అవ్వడానికి ప్రధాన కారణం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ అనే చెప్పాలి..ఈ ఎపిసోడ్ వల్ల ఈ యాప్ ని వాడేవారి సంఖ్య ఎక్కడికో వెళ్ళింది.

రెండు పార్ట్స్ గా ఆహా యాప్ లో అప్లోడ్ చేసారు..మొదటి పార్ట్ డిసెంబర్ 30 వ తారీఖున విడుదల అవ్వగా, రెండవ పార్ట్ నిన్ననే విడుదల చేసారు..రెండు పార్ట్స్ కి రెస్పాన్స్ అదిరిపోయింది..ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటుగా ఆయన బెస్ట్ ఫ్రెండ్, ప్రముఖ హీరో గోపీచంద్ కూడా పాల్గొన్నాడు..బాలయ్య బాబు తో ప్రభాస్ – గోపీచంద్ చిట్ చాట్ చూసే ప్రతీ ఒక్కరికి చాలా సరదాగా అనిపించింది.
ద్వారా పరిచయం చేస్తూ ఉంటారు..అలా ఈ ఎపిసోడ్ లో కూడా లక్ష్మి మనోజ్ఞ అనే చిన్నారి వచ్చింది..పాపం ఈ అమ్మాయి ప్రస్తుతం క్యాన్సర్ తో పోరాటం చేస్తుంది..కానీ అద్భుతమైన గాత్రం ఆమె సొంతం..ఎంతో మంచి ప్రతిభ ఉన్న ఈమెని గుర్తించి గోపీచంద్ తన తదుపరి సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చాడు.
ఇది నిజంగా ఎంతో ప్రశంసనీయం..గోపీచంద్ చేసిన ఈ సహాయానికి సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది..మరోపక్క బాలయ్య కూడా లక్ష్మి మనోజ్ఞ క్యాన్సర్ నివారణ అయ్యేంత తన బసవతారకం హాస్పిటల్ లో అన్నీ సదుపాయాలతో ఉచితంగా చికిత్స చేయిస్తానని మాట ఇచ్చాడు..బాలయ్య తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం పై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్..ప్రస్తుతం గోపీచంద్ శ్రీవాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న రామబాణం అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు..ఈ సినిమాలోనే ఆ అమ్మాయికి పాట పాడే అవకాశం ఇచ్చాడు గోపీచంద్.