
ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతున్న సరైన ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకోలేకపోయిన స్టార్ హీరో. తీసిన వరుస సినిమాలు ఫ్లాప్ల బాట పట్టాయి. క్యారియర్ మొత్తంలో ఇండస్ట్రీని ఊపేసిన పెద్ద సినిమాలు ఏమి లేకపోవటం గమనార్హం. ఇంతకీ ఎవరీ స్టార్ హీరో అంటే..మనకి అత్యంత సుపరిచితమైన గోపి చంద్.
అయితే ఈసారి గోపి చంద్ ఎలా అయినా పెద్ద హిట్ కొట్టాలని కంకణం కట్టుకున్నాడట.దానికి గాను అతను సంపత్ నంది దర్శకత్వంలో సిటీమార్ సినిమా..అది అయిపోయిన వెంటనే తేజ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఈ చిత్రానికి “అలివేలు వెంకటరమణ” అనే టైటిల్ కూడా అనుకున్నారట. మునుపటి సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలు కొంచం వైవిధ్యంగా ఉండబోతునాయనే తెలుస్తుంది. గతంలో తేజతో తీసిన నిజం, జయం సినిమాలతో మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ రెండు సినిమాలలోనూ విలన్ గా కనిపించి జనాల మెప్పు పొందాడు. ఇప్పుడు తేజతో సినిమా అంటే..గోపిచంద్ కి కలిసి వచ్చి పెద్ద హిట్ వస్తుందనే అతని అభిమానులు ఆశిస్తున్నారు. గోపిచంద్ చేస్తున్న ఈ ప్రయత్నాలు అన్ని ఫలించి ఈసరైన పెద్ద హిట్ వస్తుందో..లేదో..వేచి చూడాలి.