https://oktelugu.com/

Gopi Chand: అమెజాన్ లో స్ట్రీమింగ్ అవుతున్న గోపిచంద్ “ఆరడుగుల బుల్లెట్” మూవీ…

Gopi Chand: ఎన్నో చిత్రాలతో  విజయం సాధించిన దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్, నయనతార జంటగా నటించిన మూవీ ‘ఆరడగుల బుల్లెట్’. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చాడు. 2017 తెరకెక్కించిన ‘ఆరడగుల బుల్లెట్’ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదలకు లేట్ అయింది. విడుదలకు సిద్ధమవుతుంది అనుకునే లోపు కరోనా రావడంతో లేట్ గా ఇటివలే థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందలేక పోయింది. అయితే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 10, 2021 / 08:51 PM IST
    Follow us on

    Gopi Chand: ఎన్నో చిత్రాలతో  విజయం సాధించిన దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్, నయనతార జంటగా నటించిన మూవీ ‘ఆరడగుల బుల్లెట్’. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చాడు. 2017 తెరకెక్కించిన ‘ఆరడగుల బుల్లెట్’ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదలకు లేట్ అయింది. విడుదలకు సిద్ధమవుతుంది అనుకునే లోపు కరోనా రావడంతో లేట్ గా ఇటివలే థియేటర్లలో విడుదలైంది. అక్టోబర్ 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొందలేక పోయింది. అయితే తాజాగా ఓటిటీ వేదికగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మాస్ యాక్షన్ తరహా కధాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.

    ప్రముఖ దర్శకుడు మారుతితో కలిసి గోపిచంద్ చేస్తున్న చిత్రం “పక్కా కమర్షియల్”. అంటూ క్రేజీ ప్రాజెక్టుతో వస్తున్నాడు ఈ మ్యాచో హీరో. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపిచంద్ 29వ సినిమాగా, మారుతి 10వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.