Bigg Boss 6 Telugu Winner: ఫైనల్ కి ముందే బిగ్ బాస్ విన్నర్ ఎవరో తేలిపోయింది. గూగుల్ లో సెర్చ్ చేస్తే ఆ కంటెస్టెంట్ పేరు చూపిస్తుంది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 18 ఆదివారం విజేత ఎవరో తేలిపోనుంది. ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున లేదా గెస్ట్ విన్నర్ ని ప్రకటించనున్నారు. ఆడియన్స్ ఓట్ల ఆధారంగా విజేత ఎవరో తేలిపోతుంది.

ప్రస్తుతం హౌస్లో రేవంత్, ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి, శ్రీహాన్, శ్రీసత్య ఉన్నారు. వీరిలో ఒకరు మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా హౌస్ వీడనున్నారు. బుధవారం వరకు వచ్చిన ఓట్ల ఆధారంగా తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడని నాగార్జున గత ఆదివారం ఎపిసోడ్లో వెల్లడించారు. ఈ విషయం హౌస్ మేట్స్ కి కూడా తెలియదు. కాబట్టి ఇది వారికి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. శ్రీసత్య, కీర్తి, ఆదిరెడ్డిలలో ఒకరు ఎలిమినేట్ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఫైనల్ కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా అవతరించనున్నారు. విన్నర్ కి ప్రైజ్ మనీ రూ. 50 లక్షలు దక్కనున్నాయి. అలాగే సువర్ణభూమి వారి రూ. 25 లక్షల విలువైన ఫ్లాట్, మారుతీ సుజుకీ బ్రీజా కారు సొంతం కానున్నాయి. ప్రైజ్ మనీ, బహుమతుల మొత్తం విలువ రూ. 85 లక్షల వరకు ఉంటుంది. అంటే దాదాపు రూ. కోటి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలుచుకోనున్నారు.

మూడు నెలలకు పైగా సాగిన బిగ్ బాస్ షో ప్రయాణం అంత సులువైనది కాదు. మానసికంగా, శారీరకంగా కంటెస్టెంట్స్ యుద్ధం చేయాల్సి ఉంటుంది. అందుకే విన్నర్ కి అంత పెద్ద మొత్తంలో దక్కుతుంది. ప్రేక్షకుల్లో కూడా విన్నర్ ఎవరు అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో చాలా మంది ఆడియన్స్ ఫైనల్ కి ముందే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. వారికి ఒక షాకింగ్ ఆన్సర్ దర్శనమిస్తుంది. గూగుల్ ప్రకారం బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ రోహిత్ సాహ్ని.హూ ఈజ్ బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అని సెర్చ్ చేస్తే రోహిత్ పేరు చూపెడుతుంది. మరి గూగుల్ గెస్ ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.