Bhagavanth Kesari OTT: ‘భగవంత్ కేసరి’ నుంచి గుడ్ న్యూస్.. ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత హీరోయిన్ కాజల్ బాలయ్య పక్కన నటించి ఆకట్టుకుంది.

Written By: Srinivas, Updated On : November 1, 2023 1:24 pm

Bhagavanth Kesari OTT

Follow us on

Bhagavanth Kesari OTT: నందమూరి బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఆయన నటించిన అఖండ, వీర సింహారెడ్డితో పాటు లేటేస్టుగా నటించిన ‘భగవంత్ కేసరి’ సక్సెస్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. తన నటనతో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న బాలయ్య తాజాగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో థియేటర్లోకి వచ్చాయి. ఈ మూవీ ఇప్పటికే రూ.130 కోట్లు వసూళ్ల సాధించి ఆకట్టుకుంటోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన భగవంత్ కేసరి అక్టోబర్ 19న థియేటర్లోకి వచ్చింది. అప్పటి నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని సక్సెస్ వైపు వెళ్లింది. అయితే ఈ సినిమాను ఓటీటీలో చూసేవారు ఎప్పుడు వస్తుందా? అని అనుకుంటున్న తరుణంలో చిత్రం బృందం గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే?

సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. బిడ్డకు జన్మనిచ్చిన తరువాత హీరోయిన్ కాజల్ బాలయ్య పక్కన నటించి ఆకట్టుకుంది. ఇందులో క్రేజీ హీరోయిన్ శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా నటించి మెప్పించింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఆమె బాలయ్య సినిమాలో కూతురుగా నటించడానికి ఏమాత్రం అడ్డు చెప్పకపోవడం విశేషం. ‘భగవంత్ కేసరి’ టీజర్ నుంచే ప్లస్ టాక్ వచ్చింది. వరుస హిట్లతో జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి బాలయ్య తగిన కాన్సెప్టును సెట్ చేశారని ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.

బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ‘అఖండ’ సంచలన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసింది. ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటించారు. ఆ సినిమా తరువాత వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ సమయంలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినా బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ విజేతగా నిలిచింది. ఆ తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలయ్య ‘భగవంత్ కేసరి’లో నటించారు. అక్టోబర్ 19న రిలీజై అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా ఈ మూవీ గురించి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓటీటీ వీక్షకులకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను చెప్పేశారు. భగవంత్ కేసరి ని ఆమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులు పొందింది. ఈ నేపథ్యంలో మూవీని నవంబర్ 23న ఓటీటీలోకి తీసుకురానున్నారు. థియేటర్లోనే బంపర్ హిట్టు కొట్టిన భగవంత్ కేసరి ఓటీటీల్లోనూ సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నారు. దీంతో ఆ డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.