
Good Luck Sakhi: ‘గుడ్ లక్ సఖి’ అనే సినిమాను వాయిదా వేయడానికే తీసినట్టు ఉన్నారు. సినిమా రిలీజ్ డేట్ ను గ్రాండ్ గా ప్రకటించడం, ఆ తర్వాత సైలెంట్ వాయిదా పడింది అంటూ చిన్న ట్వీట్ చేయడం.. ఇది ఈ సినిమా నిర్మాతలకు ఆనవాయితీ అయిపోయింది. అసలుకే కీర్తి సురేష్ కి మార్కెట్ లేదయ్యా అంటే.. ఈ వాయిదాల పరంపర ఒకటి ? ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది ఈ సినిమా.
ఇంకా కరెక్ట్ గా చెప్పుకుంటే.. గతేడాది నుంచి ఇప్పటివరకు కరెక్ట్ గా 10 సార్లు రిలీజ్ డేట్ ను మార్చారు. విడుదల తేదీ ఇదే అంటూ ప్రకటిస్తారు. ఆ తర్వాత కొన్ని కారణాల కారణంగా మా సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నాం అని చెబుతారు. ఈ నేపథ్యంలో పదోసారి కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అది నవంబర్ 26 అని. ఇదే మా సినిమా రిలీజ్ డేట్ అంటూ బాగా ఊదరగొట్టారు.
కట్ చేస్తే.. మళ్ళీ రిలీజ్ డేట్ మారింది. ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ తాజాగా మరో కొత్త డేట్ ను ఎనౌన్స్ చేశారు. డిసెంబర్ 10న మా ‘గుడ్ లక్ సఖి’ సినిమా విడుదల కాబోతోన్నట్టు నిర్మాతలు ప్రకటించారు. మరి 11వ సారి ప్రకటించినా ఈ కొత్త రిలీజ్ డేట్ అయినా ఇలాగే ఉంటుందా ? లేక, ఎప్పటిలాగే రిలీజ్ డేట్ మారిపోతుందా ?
మరోపక్క ఈ సినిమాకి దర్శకుడు కొత్త అతను. నగేష్ కుకునూర్ అనే వ్యక్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా పై అసలు అంచనాలు కూడా లేవు. ఈ సినిమాలో ఆది పినిశెట్టితో పాటు జగపతి బాబుకూడా నటించారు. అలాగే ఇతర కీలక పాత్రల్లో కూడా ప్యాడింగ్ ఆర్టిస్ట్ లే ఉన్నారు. అయినా ఎందుకో కీర్తి సురేష్ సినిమాగానే దీన్ని ప్రమోట్ చేస్తున్నారు.
అసలకే కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి. ఇంతకీ 11 సార్లు రిలీజ్ డేట్లు మార్చిన ఈ సినిమా నిర్మాత పేరు సుధీర్ చంద్ర.
Also Read: మళ్లీ ట్రాక్‌లోకి అక్కినేని హీరో.. మరో ప్రాజెక్టుకు శ్రీకారం!